కృష్ణ

ఉగ్రవాదుల దాడి పిరికి పంద చర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : భారత జవాన్లపై ఉగ్రవాదుల దాడి ఓ పిరికి పంద చర్య అని మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ అన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో వీర మరణం పొందిన 44 మంది జవాన్లకు శుక్రవారం పురపాలక సంఘ కార్యాలయం ఎదుట కొవ్వొత్తుల ప్రదర్శనతో నివాళులర్పించారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ డైరెక్టర్ వంపుగడల చౌదరి, కౌన్సిలర్లు సైకం శ్రీను తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌కు ‘మత్తి’ రాజీనామా

అవనిగడ్డ, ఫిబ్రవరి 15: మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి, అవనిగడ్డ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి పదవికి, పీసీసీ సభ్యత్వానికి ప్రముఖ న్యాయవాది మత్తి వెంకటేశ్వరరావు శుక్రవారం రాజీనామా చేశారు. ఆయనకు మద్దతుగా సమన్వయ కమిటీ సభ్యులు, మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు కూడా స్థానిక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటి వరకు తనకు సహకరించిన పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

కాపుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఫిబ్రవరి 15: కాపు సామాజిక వర్గానికి అన్ని విధాలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి రవీంద్ర తెలిపారు. శుక్రవారం మేకావానిపాలెంలో రూ.2కోట్లతో నిర్మించనున్న కీ.శే. కొండపల్లి సోమయ్య కాపు భవన్‌కు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ కాపుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ ఇడీ పెంటోజీరావు, మున్సిపల్ చైర్మన్ బాబాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.