కృష్ణ

వీరమ్మ తల్లీ మమ్మాదుకోమ్మా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉయ్యూరు: ఆదివారం కావడంతో మూడవ రోజు ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్ళు భక్తజనంతో పోటెత్తాయి. శుక్రవారం రాత్రి గ్రామోత్సవంతో ప్రారంభమైన ఉత్సవాలు, శనివారం ఊయల ఉత్సవం అనంతరం అమ్మవారు పుట్టినింట కొలువుతీరారు. కాగా ఆదివారం తెల్లవారు ఝామునుండే భక్తుల క్యూలైన్‌లలో బారులు తీరారు. భక్తుల రాకను ముందుగానే అంచనావేసిన అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు పటిష్టమైన ఏర్పాట్లు చేసారు. డప్పువాయిద్యాలతో గొర్రెపొటేళ్ళు, కోళ్ళు పొంగళ్ళు సమర్పించి భక్తులు మొక్కుబడులు తీర్చుకున్నారు. పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్‌తో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. బోడే భక్తులకు పులిహోర పంపిణీ చేసారు. పలు స్వచ్చంద సేవా సంస్ధలు భక్తుల దాహార్తిని తీర్చేందుకు వాటర్, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు.