కృష్ణ

పూరగుట్ట జీఓ పేదల విజయమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: పేదల నివేశన స్థలాలకోసం ఉద్దేశించిన పూరగుట్టకు అనుమతిస్తూ ప్రభుత్వం జీఓ నెంబర్ 318 ద్వారా అనుమతి ఇవ్వటం ముమ్మాటికీ పేదల విజయమేనని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం స్థానిక పార్టీ కార్యాలయం వద్ద జరిగిన మైలవరం మండల కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని బావోద్యేగ ప్రసంగం చేశారు. పూరగుట్టలో పేదలకు నివేశనా స్థలాలు అందించాలన్న సదుద్దేశ్యంతో ఎంతో కష్టపడి పని చేస్తుంటే దానిని కొందరు దొంగలు అడ్డుకుని రాద్దాంతం చేశారని ఆరోపించారు. ఐనప్పటికీ పేదలే ముఖ్యమని భావించి జీఓను విడుదల చేయించానని ఇది పేదల విజయమన్నారు. ఈభూమిలో పేదలకు నివేశనా స్థలాలను అధికారులు పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. అభివృద్ది చేస్తుంటే విపక్షాలు విషం చిమ్ముతున్నాయని ధ్వజమెత్తారు. అక్రమ సొమ్ముకు కక్కుర్తిపడి దొంగల వెంట వెళ్తున్న గ్రామస్థాయిలోని దొంగలను కనిపెట్టాలన్నారు. ఈభూమిలో పలు ప్రభుత్వ కార్యాలయాలు, ఆటోనగర్, విద్యాలయాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇదే ప్రాంతంలో పేదలకు నివేశనాస్థలాలను కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. దీనికి అనుకుని ఔటర్ రింగ్‌రోడ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈప్రాంతం మైలవరానికి మరో మణిహారంగా మారనున్నట్లు తెలిపారు. మైలవరం నియోజకవర్గంలో 33కోట్లతో ఎస్సీ బాలికల హాస్టల్ వెల్లటూరులో మంజూరైందని, 11 ఎకరాలలో దీనిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఆర్‌అండ్‌బి, పంచాయితీరాజ్ రోడ్లు అవసరమైన చోట నిర్మించామన్నారు. మైలవరం ఆసుపత్రిని 3కోట్లతో 50 పడకల ఆసుపత్రిగా విస్తరిస్తున్నట్లు తెలిపారు. దీనిని త్వరలోనే 100 పడకల ఆసుపత్రిగా విస్తరింపజేస్తానని హామీ ఇచ్చారు. మైలవరం నియోజకవర్గంలో 12,440 పక్కా ఇళ్ళు మంజూరు చేయించినట్లు తెలిపారు. 186 కోట్ల రూపాయలతో ఇంటింటికీ కుళాయి కనెక్షన్ అందిస్తున్నట్లు తెలిపారు. 3,968 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయించామన్నారు. ఎన్నికల సందర్భంగా రెవెన్యూ, పోలీస్ శాఖలలో జరిగిన బదిలీలను కూడా తమ గొప్పగా చెప్పుకోవటం వైకాపా నేతలకే చెల్లిందని ఎద్దేవా చేశారు. పార్టీ కార్యకర్తల త్యాగాలతోనే పార్టీ మనుగడ, నేతల మనుగడ ఉందని వారి త్యాగాలను మరువలేమన్నారు. నాడు ఎన్టీఆర్ పుణ్యమా అంటూ తారకరామానగర్ ఏర్పడిందని, నేడు చంద్రబాబు పుణ్యమా అంటూ పూరగుట్ట పేదల కోసం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఎన్ని అప్పులున్నా, అభివృద్ధిలో ఎక్కడా రాజీలేకుండా అభివృద్ధికి చిరునామా ఆంధ్రప్రదేశ్ అన్న చందంగా చంద్రబాబునాయుడు పని చేస్తున్నారని, అందరూ ఆయనకు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. మైలవరం నియోజకవర్గంలో అన్ని కులాలకు సంబంధించి కమ్యూనిటీ భవనాలు, కళ్యాణ మండపాలు నిర్మించేందుకు నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. అదేవిధంగా కోట్లాది రూపాయల వ్యయంతో స్కూల్ భవనాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. 100 కోట్ల రూపాయలతో కొండపల్లి ఖిల్లా, 1680 కోట్ల రూపాయలతో కృష్ణానదిపై ఇబ్రహీంపట్నం వద్ద కూచిపూడి ఐకాన్ బ్రిడ్జిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇచ్చిన హామీలనే కాక ఇవ్వని ప్రజలకు అవసరమైన పనులను కూడా చేసి చరిత్ర సృష్టించామన్నారు. చేసిన పనులను గ్రామాలలో ఇంటింటికీ తిరిగి చెప్పి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పూరగుట్టకు జీఓ తెచ్చిన మంత్రి ఉమను నేతలు, ఘనంగా సత్కరించారు. ఈసమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోమటి సుధాకర్, ఎంపిపి లక్ష్మి, జడ్పీటిసి రాము, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గంజి కృష్ణారెడ్డి, కుమార్‌రెడ్డి, తాతా పోతురాజు తదితరులు పాల్గొన్నారు.