కృష్ణ

ధృడ సంకల్పంతోనే విజయావకాశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడ్లవల్లేరు: విద్యార్థులు దృఢ సంకల్పంతో ముందుకు సాగితే విజయాలు వరిస్తాయని రాష్ట్ర ఉన్నత విద్య పాలకమండలి చైర్మన్ ప్రొ. విజయరాజు అన్నారు. స్థానిక గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం జక్‌ఫెస్ట్ 2019 వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎస్ విజయరాజు, సినీ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ గురువు చెప్పిన విషయాలను శ్రద్ధగా ఆలకిస్తారో అటువంటి విద్యార్థులు అభివృద్ధి చెందుతారన్నారు. రాష్ట్రంలో ఎన్నో వందల కళాశాలలు ఉన్నాయని, కానీ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల మాత్రమే విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందన్నారు. సభకు అధ్యక్షత వహించిన కళాశాల చైర్మన్ వల్లూరుపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ జక్‌ఫెస్ట్ వేడుకలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రిన్సిపాల్ పి రవీంద్రబాబు మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న కళా నైపుణ్యాలు మెరుగుపర్చుకోవడానికి చక్కటి వేదిక అన్నారు. క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. అతిథులు గౌరవవందనం స్వీకరించారు. ప్రారంభోత్సవ వేడుకల్లో విద్యార్థుల పిరమిడ్ విన్యాసాలు ఆకర్షించాయి. అనంతరం జయరాజు క్రీడా జ్యోతిని వెలిగించారు. కళాశాల చైర్మన్ డా. వల్లూరుపల్లి నాగేశ్వరరావు కళాశాల వ్యవస్థాపకుడు వివిఆర్ శేషాద్రిరావు స్మృతికి చిహ్నంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ వి సత్యనారాయణ, వల్లూరుపల్లి రామకృష్ణ, వైస్ ప్రిన్సిపాల్ డా. పి కరుణ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ సుబేదార్ రాజారావు మృతి
నాగాయలంక, ఫిబ్రవరి 21: మండల పరిధిలోని వక్కపట్లవారిపాలెం శివారు నందమూరు తారక రామారావు కాలనీకి చెందిన విశ్రాంత సుబేదార్ మట్టా రాజారావు (78) మృతి చెందారు. గత కొంత కాలంగా అస్వస్థతగా ఉన్న రాజారావు విజయవాడ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గురువారం మృతి చెందారు. రాజారావు గతంలో వక్కపట్లవారిపాలెం గ్రామ సర్పంచ్‌గా పని చేశారు. మండలంలోని వివిధ వర్గాల ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న రాజారావు మృతి వార్త తెలిసిన వెంటనే మాజీ శాసనసభ్యులు అంబటి శ్రీహరిప్రసాద్, మాజీ సర్పంచ్ అంబటి శ్యాంప్రసాద్, డీసీ చైర్మన్ అంబటి లక్ష్మణ ప్రసాద్, జిల్లా టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి, సహకారవేత్త వర్రే రాంబాబు, వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నాయకులు సంతాపం తెలిపారు.
ఆంగ్లభాషను జాతీయభాషగా గుర్తించాలి
మచిలీపట్నం (కల్చరల్), ఫిబ్రవరి 21: అంతర్జాతీయ భాషగా గుర్తింపు పొందిన ఆంగ్ల భాషను జాతీయ భాషగా గుర్తించాలని నోబుల్ కళాశాల ఆంగ్ల శాఖాధిపతి ఎస్‌జె ఎర్నెస్ట్ అన్నారు. స్థానిక నోబుల్ కళాశాలలో గురువారం అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవం సందర్భంగా ఆంగ్లము-్భరతదేశ భాషలు అనే అంశంపై బృంద చర్చ జరిగింది. చర్చలో పాల్గొన్న తృతీయ సంవత్సరం బీఎ (ఆంగ్ల సాహిత్యం) విద్యార్థులు మాట్లాడుతూ విశ్వ విద్యాలయాలు, పోటీ పరీక్షలు తదితర చోట్ల ఆంగ్ల భాషను ఉపయోగిస్తున్నారన్నారు. పార్లమెంట్‌లో కూడా హిందీతో పాటు ఆంగ్ల భాషను ఉపయోగిస్తున్నారన్నారు. విశ్వానికి ఆంగ్ల భాష కిటికీ వంటిదన్నారు. ఈ చర్చలో ఎర్నెస్ట్ సమన్వయకర్తగా వ్యవహరించారు.