కృష్ణ

దొంగలు సోషల్ మీడియాను వాడుతున్నారు: మంత్రి ఉమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు: దొంగలను ప్రజలు ఒకపక్క ఛీ కొడుతుంటే, సిగ్గులేకుండా సోషల్ మీడియాలో నవ్వుతూ ఫోటోలకు ఫోజులిచ్చి పోస్టులు పెడుతున్నారని ప్రతిపక్ష పార్టీ నేతలపై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. జి.కొండూరు టిడిపి కార్యాలయంలో గురువారం జరిగిన మండల టిడిపి సమావేశంలో మంత్రి ఉమ మాట్లాడుతూ ఇళ్ళలో పడుకున్న వారే వాళ్ళ వద్దకు వెళ్తున్నారని, అటువంటి వారిని ఎంతకు అమ్ముడుపోయారో నిలదీయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చింతమనేని వ్యవహారాన్ని కూడా రెచ్చగొట్టి లబ్దిపొందాలని చూశారన్నారు. ఫోన్లు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మనీ ల్యాండరింగ్ కేసుల్లో ముద్దాయిలకు, అవినీతి పరులకు మనల్ని కొనే పరిస్థితి ఎవ్వరికీ లేదన్నారు. మండలంలోని నాయకులు కనీసం మీటింగుకు కూడా రానంత బిజీగా మారిపోయారని చురకలు వేశారు. బూతుల్లో వెరిఫికేషన్ పూర్తి చేయాలన్నారు. చేసిన అభివృద్ధి గురించి ధైర్యంగా ప్రజలకు చెప్పాలని, అదే సమయంలో వారి కష్టాలు, సమస్యలను తెలుసుకుని వారికి చేతనైన సహాయం చేయాలన్నారు. హైదరాబాద్‌లో ఆస్తులు కాపాడుకోవడానికి జగన్ పంచన చేరిన కొందరు అమ్ముడుపోయిన నేతలు సీఎం చంద్రబాబును తిట్టడం దుర్మార్గమన్నారు. పూరగుట్ట భూమిని ప్రజా ఉపయోగమైన కార్యక్రమాల కోసం కేటాయిస్తూ జీఓ నెంబరు 318 విడుదలైందన్నారు. దీన్ని చాలా రాద్ధాంతం చేశారన్నారు. చింతలపూడి, పట్టిసీమ, గోదావరి, సాగర్ జలాలు అంటే ఏమిటో తెలియని వాళ్ళు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఓట్ల కోసం ఎంతకైనా దిగజారుతున్నారన్నారు. బీసీ అభ్యర్థిని ఇక్కడి నుంచి పంపించి వేసి, మళ్ళీ బీసీలను ఉద్ధరిస్తున్నట్లు జగన్ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. వెల్లటూరులో బాలయోగి గురుకుల పాఠశాలను రూ.33కోట్లతో నిర్మిస్తున్నామని, ఇంకా కొత్తగా 3081 ఇళ్ళు మంజూరైనాయన్నారు. మైలవరంలో 50 పడకల ఆసుపత్రి, అన్నక్యాంటీన్ల ఏర్పాటు ఎన్నో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలతో తెలుగుదేశం ప్రభుత్వం జనాదరణలో మేటిగా ఉందన్నారు. ఎఎంసి చైర్మన్ వుయ్యూరు నరసింహారావు, విజయబాబు, ఎమ్మెల్సీ అభ్యర్ధి కొల్లి నాగేశ్వరరావు, జువ్వా రాంబాబు, పటాపంచల నరసింహారావు, బూరుసు శివ, దగ్గుమల్లి భారతి, ఆర్‌ఆర్ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.