కృష్ణ

కుర్చీ పిచ్చి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, : వైసీపీ నేతలు ప్రతిదాన్ని మసిపూసి మారేడుకాయ చేయాలని చూస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. స్థానిక విలేఖరితో ఆయన శుక్రవారం మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధికి అడ్డం పడుతూ వైసీపీ అధినేత జగన్‌మోహనరెడ్డి భ్రష్టు పట్టించాలని చూస్తున్నారని విమర్శించారు. తాము రాష్ట్భ్రావృద్ధికి ఏం చేస్తామో చెప్పకుండా మా అయ్య అంత చేశారు... ఇంత చేశారని చెప్పుకు తిరుగుతూ చెట్టు పేరుతో ‘ఓట్లు దండుకోవాలని’ చూస్తున్నారని దుయ్యబట్టారు. ఆయన బతికుండగా నాటి ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ఏర్పడితే ‘పాకిస్తాన్’ పక్కన ఉన్నట్టేనని చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోవాలని మంత్రి అన్నారు. మరి అటువంటిది ‘తెలంగాణ’ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అడ్డం పెట్టుకుని ఇక్కడ ఏదో సాధిద్దామని పగటి కలలు కంటున్నారని మంత్రి ఉమ అన్నారు. ‘పోలవరం’పై కోర్టుకెళ్లి ప్రాజెక్టుకు అడ్డం పడాలని చూస్తున్న వారితో అంటకాగుతూ ఇక్కడ రాజకీయాలు చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ‘పోలవరం’ పూర్తయితే నవ్యాంధ్ర సస్యశ్యామలం అవుతుందన్న దుగ్ధతో తెలంగాణ సర్కారు ‘కోర్టు’ కెక్కిందని అన్నారు. అటువంటి వారిని వెంటేసుకుని ఇక్కడ ఎన్నికల్లో గెలవాలనుకోవడం ఆత్మహత్య సదృశ్యమని గుర్తుంచుకోవాలని మంత్రి ఉమ స్పష్టం చేశారు. వాళ్లకు తెలిసిందల్లా కులాల కుమ్ములాటలు, వర్గాలను రెచ్చగొట్టి, జనానికి అరచేతిలో వైకుంఠం చూపెడుతూ ‘కుర్చీ’ పిచ్చితో కల్లోలం చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. పదవీ వ్యామోహం తప్ప రాష్ట్రానికి కొంతైనా ఉపయోగపడదామన్న కనీస ‘ఆలోచన’ ఆయనలో కాగడా వేసి చూసినా కనిపించడం లేదని స్పష్టం చేశారు. వాళ్లకు కావాల్సింది రాష్ట్భ్రావృద్ధి కాదని, కేవలం ‘కుర్చీ’ మాత్రమేనని అన్నారు. ‘పదవి పిచ్చి’తో అసంబద్ధ ప్రేలాపనలు పేలుతున్న వారిని ఎక్కడ ఉంచాలో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసని స్పష్టం చేశారు. పక్క రాష్ట్రంలో బతుకుతూ ఇక్కడ రాజకీయాలు చేయాలంటే కుదరదని, గత ఎన్నికల్లో కొన్ని సీట్లలో గెలిచినా ‘అలక’ పేరుతో ‘అసెంబ్లీని బహిష్కరించిన’ వారిని ఈ ఎన్నికల్లో ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారని మంత్రి ఉమ వివరించారు. పార్లమెంటు సాక్షిగా విభజన సమయంలోను, ఆ తరువాత బీజేపీ నేతలు చేసిన హామీలు ‘మట్టి’లో కలిపోయి, ‘నీటి’లో కొట్టుకుపోయాయని వ్యాఖ్యానించారు. ‘తాదూర కంత లేదు... మెడకో డోలన్నట్టు’ బీజేపీ సభలకు ‘మంది’ని ‘సరఫరా’ చేస్తూ ‘లేని వాపు’ని ‘బలం’గా చిత్రీకరించాలని చూస్తున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. వాళ్లకు సొంత ప్రయోజనాలు తప్ప ఇసుమంతైనా ‘రాష్ట్భ్రావృద్ధి’ గురించి ఆలోచన లేదన్నది స్పష్టమవుతోందని విమర్శించారు. తమ సభలకు సైతం పక్క రాష్ట్ర బస్సులనే వాడుతున్నారని, వాళ్లకు రాష్ట్రం అన్నా, ఇక్కడి సంస్థలన్నా చులకన అని తూర్పారబట్టారు. వివిధ కేసుల్లో నిత్యం కోర్టుల చుట్టూ తిరిగే ‘జగన్నా’టక సూత్రధారికి వచ్చే ఎన్నికల్లో శృంగభంగం తప్పదని మంత్రి జోస్యం చెప్పారు.