కృష్ణ

ఆర్జేయూకేటీల్లో ‘బోర్డు ఆఫ్ స్టడీస్’ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు : రాజీవ్‌గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం పరిధిలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో నడుస్తున్న ట్రిపుల్ ఐటీల్లో ఒకే నిర్దిష్టమైన విద్యావిధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు విశ్వవిద్యాలయం ఉప కులపతి వి రామచంద్రరాజు తెలిపారు. 2019-20 విద్యాసంవత్సరం నుండి నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ఒకే విద్యావిధానం అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. శనివారం నూజివీడు ట్రిపుల్ ఐటీని ఆయన సందర్శించారు. విద్యార్థులకు భోజన వసతి అందించే మెస్‌లను పరిశీలించారు. భోజన నాణ్యతపై విద్యార్థుల నుండి సమాచారం తీసుకున్నారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఆర్జేయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో ఒకే విద్యావిధానం అమలు అయ్యే విధంగా బోర్డు ఆఫ్ స్టడీస్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ట్రిపుల్ ఐటీలలో చదువుతున్న విద్యార్థులకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యను అందిస్తున్నామని అన్నారు. విద్యార్థులకు అందుతున్న వౌలిక సదుపాయాలను స్వయంగా పరిశీలించి, మరింత మెరుగు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. గత ఏడాది నవంబరులో ఆర్జేయూకేటీ ఖాతాలో 400 కోట్ల రూపాయలు నగదు నిల్వ ఉండగా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 185 కోట్ల రూపాయలను పీడీ అకౌంట్‌కు బదిలీ చేసినట్లు ఆయన వివరించారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో సుమారు కోటి రూపాయల మేరకు మెస్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని త్వరలో చెల్లిస్తామని చెప్పారు.
డైరెక్టర్ల నియామకం
నూజివీడు, ఒంగోలు ట్రిపుల్ ఐటీలకు డైరెక్టర్ల నియామక ప్రక్రియ పూర్తి అయినట్లు విసీ రామచంద్రరాజు తెలిపారు. కృష్ణావిశ్వవిద్యాలయానికి చెందిన డి సూర్యచంద్రరావును నూజివీడు ట్రిపుల్ ఐటీ డైరెక్టరుగా, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి చెందిన సి వెంకటరావును ఒంగోలు ట్రిపుల్ ఐటీ డైరెక్టరుగా నియమించినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ట్రిపుల్ ఐటీ శ్రీకాకుళం డైరెక్టర్ హరశ్రీరాములు, రిజిస్ట్రార్ గంగయ్య, అధికారులు గోపాలరావు, సునీల్‌భగత్, పావని తదితరులు పాల్గొన్నారు.