కృష్ణ

పరిపాలనాదక్షుడు ‘లక్ష్మీకాంతం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : జిల్లా కలెక్టర్‌గా పని చేసిన అనతి కాలంలోనే జిల్లాకు పేరుప్రఖ్యాతలు తీసుకు వచ్చి టీటీడీ జెఇఓగా బదిలీపై వెళ్లిన బి లక్ష్మీకాంతం జిల్లా వాసుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని పలువురు వక్తలు పేర్కొన్నారు. మచిలీపట్నం పురపాలక సంఘ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ అధ్యక్షతన శనివారం స్థానిక ఈశ్వర్ రెసిడెన్సీలో లక్ష్మీకాంతంకు పౌర సన్మానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్ అంటే టక్కున గుర్తుకు వచ్చే వ్యక్తి ఎవిఎస్ రెడ్డి అన్నారు. అటువంటి ఎవిఎస్ రెడ్డి పేరును మైమరిపింప చేసే విధంగా లక్ష్మీకాంతం ప్రజలకు సేవలు అందించారన్నారు. ఏ చిన్న సమస్య ప్రజల నుండి వచ్చినా వెంటనే పరిష్కరించి వారి మన్ననలు పొందారన్నారు. కలెక్టర్ అనే అహం లేని వ్యక్తి లక్ష్మీకాంతం అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లటంతో పాటు ప్రాధాన్యతతో కూడిన అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బచ్చుల అనీల్, వాసవీ క్లబ్ జోన్ చైర్మన్ యండూరి సురేష్, వాసవి క్లబ్ యువ సంఘం అధ్యక్షుడు వేముల కృష్ణ, కార్యదర్శి సన్నిధి నాగ సాయి శ్రీనివాస్, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్‌లు అబ్దుల్ అజీమ్, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు

అవనిగడ్డ, : త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నియోజకవర్గంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తిస్తున్నట్లు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి చక్రపాణి తెలిపారు. శనివారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో పోలీసు, రెవెన్యూతో పాటు ఇతర శాఖలకు చెందిన అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. సమశ్యాత్మక పోలింగ్ కేంద్రాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు ఆ ప్రాంత ఓటర్లకు అవగాహన కల్పిస్తారన్నారు. నియోజకవర్గంలో 246 పోలింగ్ కేంద్రాలు ఉండగా 88 కేంద్రాలకు ర్యాంప్‌లు నిర్మించాల్సి ఉందన్నారు. ఈ నిర్మాణ పనులు వారం రోజుల్లో సర్వశిక్ష అభియాన్ ద్వారా నిర్మించటం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో 4909 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారని, మాజీ సైనికోద్యోగులు 113 మంది, వీఐపీలు 1058 ఉన్నారని తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే 1950 టోల్‌ఫ్రీ నెంబరుకు ఫోన్ చేయాలన్నారు. ఈవీఎంలపై అపోహలు తొలగించేందుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తామని, ఆందోళన అవసరం లేదని, ఏడు సెకన్లు ఓపిక పడితే ఓటు ఎవరికి పడింది మీరే చూసుకోవచ్చని చక్రపాణి తెలిపారు. పట్ట్భద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి అవనిగడ్డ ప్రభుత్వ హైస్కూల్‌లో 93, 94 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 1767 మంది ఓటర్లు నమోదు కాగా వారిలో పురుషులు 1002, మహిళలు 665 మంది ఉన్నారని వివరించారు. ఈ సదస్సులో తహశీల్దార్లు పాల్గొన్నారు.