కృష్ణ

‘త్రీ స్టార్స్’తో ‘కృష్ణా’కు అగ్రస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, : త్రీ స్టార్స్ కాంబినేషన్‌లో జిల్లాను అన్నింటా అగ్రపథాన నిలిపి ప్రజలకు న్యాయ, రెవెన్యూ, పోలీస్ సేవలను చేరువ చేశామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై లక్ష్మణరావు అన్నారు. జిల్లా కలెక్టర్‌గా విశేష సేవలు అందించి తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం జెఇఓగా బదిలీపై వెళ్లిన బాలయ్యనాయుడు లక్ష్మీకాంతంకు మచిలీపట్నం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆత్మీయ సత్కార మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ఠ అతిథిగా విచ్చేసిన ప్రధాన న్యాయమూర్తి వై లక్ష్మణరావు లక్ష్మీకాంతం సేవా నిరతిని, పరిపాలనాదక్షతను కొనియాడారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా తాను, జిల్లా కలెక్టర్‌గా లక్ష్మీకాంతం, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ముగ్గురం త్రీ స్టార్ కాంబినేషన్‌లో ప్రజలకు చేరువ అయ్యామన్నారు. విభిన్నమైన రీతిలో సేవలు అందించిన లక్ష్మీకాంతం జిల్లా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. జిల్లాను రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో జిల్లాను ముందుకు నడిపించి అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలిపిన లక్ష్మీకాంతం అభినందనీయులన్నారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మాట్లాడుతూ ప్రతి పారా మీటర్‌లోనూ జిల్లాను అగ్రస్థానంలో నిలిపిన ఘనత కలెక్టర్‌గా లక్ష్మీకాంతంకే దక్కిందన్నారు. ప్రతి సమస్యను మానవీయ కోణంతో చూసి పరిష్కరించడం లక్ష్మీకాంతం నైజమన్నారు. నేను చాలా మంది కలెక్టర్లతో పని చేసినా లక్ష్మీకాంతం లాంటి కలెక్టర్‌ను ఎప్పుడూ చూడలేదు. సన్మాన గ్రహీత లక్ష్మీకాంతం మాట్లాడుతూ అధికారులు, ప్రజా ప్రతినిధులతో పాటు ప్రజల సహాయ సహకారాలతోనే తాను జిల్లా కలెక్టర్‌గా సమర్ధవంతమైన సేవలు అందించినట్లు తెలిపారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన కృష్ణాజిల్లాను చరిత్ర పుటల్లో మరోసారి నిలిపానన్న ఆనందంతో తాను టీటీడీ జెఇఓగా బదిలీ అయ్యానన్నారు. తాను ఎక్కడ ఉన్నా ప్రజలకు సేవ చేయాలనే తపనతోనే పని చేస్తానన్నారు. ప్రజలకు సేవ చేయడం వల్ల భగవంతునికి సేవ చేయడమేనన్నారు. టీటీడీ జెఇఓగా కలియుగ దైవం చెంతనే భక్తులకు సేవలు అందించే అవకాశం తనకు లభించడం మహదానందంగా ఉందన్నారు. అధికారులకు బదిలీ తప్పదు పదవీ విరమణ తప్పదన్నారు. అధికారి పని చేసిన కాలంలో ప్రజలకు ఏ విధంగా సేవలు అందించామన్నదే ముఖ్యమన్నారు. కత్తి మీద సాములాంటి జిల్లాలో అందరినీ మెప్పించే పాలన అందించే అవకాశం నాకు లభించడం ఆనందంగా ఉందన్నారు. మచిలీపట్నం ప్రెస్ క్లబ్ కన్వీనర్ అంబటి శేషుబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అడిషనల్ పోలీసు సూపరింటెండెంట్ సోమంచి సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.