కృష్ణ

నిండా మునిగిన మిర్చి రైతులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు, : మిర్చి రైతులు ధరలు లేక దిగాలు పడుతున్నారు. ఇప్పటికే నష్టాలు మూట గట్టుకున్నారు. మిర్చి తోటలకు తెగుళ్ళతో పాటు దిగుబడులు తగ్గటంతో ఏమి చేయాలో పాలు పోక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కొన్ని గ్రామాల్లో మిరపకాయలు ఉండగానే తోటలను రైతులే స్వచ్ఛందంగా పీకేస్తున్నారు. జి.కొండూరు మండలంలో మెట్ట ప్రాంతం ఎక్కువగా ఉండటంతో ప్రతి యేడాది మిర్చి తోటలను ఎక్కువగా సాగు చేస్తుంటారు. కవులూరు, చెరువుమాధవరం, జి.కొండూరు, చెవుటూరు, మునగపాడు, గడ్డమణుగు, పినపాక గ్రామాల్లో మిర్చి సాగు ఎక్కువ. ఈ యేడాది మిర్చి తోటలకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. వైరస్ వల్ల తోటలను చాలావరకూ పీకేసి, మళ్ళీ కొత్తగా నారు తెచ్చి నాటుకున్నారు. దీనివల్ల ఎకరానికి అదనంగా రూ.10వేలు ఖర్చు పెరిగింది. ఇప్పటికి ఎకరానికి సుమారు రూ.1.25 లక్షలు వరకూ ఖర్చు పెట్టామని రైతులు చెబుతున్నారు. అయతే ఎకరానికి 15 క్వింటాళ్ళ వరకూ దిగుబడి వచ్చిందంటున్నారు. క్వింటాలు రూ.7 వేలు మాత్రమే ధర పలుకుతోంది. కనీసం రూ.10 వేలు ఉంటే గిట్టుబాటు అయ్యేది. బహిరంగ మార్కెట్‌లో ఉన్న ధర, మిర్చి కోతలు కోసే కూలీలకు చెల్లించడానికి కూడా సరిపోవడం లేదని రైతులు అంటున్నారు. ప్రభుత్వం మిర్చికి మద్దతు ధర ప్రకటించి, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వారు ముక్తకంఠంతో వేడుకుంటు న్నారు. మిర్చిలో వచ్చిన తాలుకాయలను కొనేనాథుడే లేడని రైతులు చెబుతున్నారు. నాణ్యమైన, తాలు కాయలను గ్రేడింగ్ చేయడానికి కూడా అదనంగా ఖర్చు పెట్టి, మరింత అప్పుల పాలవుతున్నామని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం రైతులకు ఆర్ధిక సాయం చేసేకంటే పండిస్తున్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

పేదల దేవాలయం ‘పూరగుట్ట’
* స్థలాలతోపాటు పక్కా ఇళ్లు

* కుట్రలు చేసే వారికి ఇది చెంపపెట్టు

* అర్హత కలిగిన వారందరికీ మంజూరు

* మంత్రి దేవినేని ఉమ వెల్లడి

మైలవరం, : పూరగుట్ట పేదల దేవాలయమని వారికే సర్వ హక్కులు కల్పించి ఇళ్ళ స్థలం, పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. శనివారం రాత్రి స్థానిక ఎంపిడిఓ కార్యాలయం ఆవరణలో జరిగిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా చివరికి విజయం పేదలదేనన్నారు. కుట్రలు చేసే వారికి ఇది చెంపపెట్టన్నారు. అర్హత కలిగిన వారందరికీ ఇక్కడ ఇళ్ళ స్థలంతోపాటు పక్కా ఇంటిని కూడా నిర్మించి ఇస్తామని వెల్లడించారు. పూరగుట్టలోనే పాలిటెక్నిక్ కళాశాల, 33 కోట్లతో ఎస్సీ బాలికల వసతి గృహం, స్కూల్ నిర్మాణం వంటివి చేపట్టి అద్భుత కాలనీగా తీర్చిదిద్దుతానని అన్నారు. అవినీతి సొమ్ముతో కుట్రలు చేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్న వారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. పూరగుట్టలో పేదలకు ఇళ్ళ స్థలాలివ్వాలన్న సంకల్పంతో ఉండి రోడ్ల నిర్మాణం, విద్యుత్ లైన్లు, తాగునీటి సదుపాయాలను కోట్లాది రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తుంటే దొంగలు పిటిషన్లు పెట్టి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అమాయక ప్రజలకు చీరెలు, పరదాలు, కర్రలు ఇచ్చి పూరగుట్టలోకి పంపి ఆక్రమణలు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రలోభాలకు ఎవరూ లొంగవద్దని, అందరికీ ఇళ్ళ స్థలాలు, ఇళ్ళు మంజూరు చేస్తామన్నారు. ఇంటింటికీ తిరిగి ఇళ్ళ స్థల పట్టాలను పంపిణీ చేయిస్తానని ఎవరికీ నయాపైసా లంచం ఇవ్వవద్దని సూచించారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తామెప్పుడూ పేదల పక్షమేనని, వారి కోసం ఏదైనా చేస్తానని పేర్కొన్నారు. మైలవరం నియోజకవర్గంలో 15వేల పక్కా ఇళ్ళను మంజూరు చేశామని అందరూ ఇళ్ళు నిర్మించుకుని తమ సొంతింటి కలను సాకారం చేసుకోవాలన్నారు. ఈసందర్భంగా మైలవరం, పొందుగల, అనంతవరం గ్రామాలకు చెందిన నిరుపేదలకు ఇళ్ళ స్థలాల పట్టాలను మంత్రి ఉమ అందించారు. కార్యక్రమంలో ఎంపిపి లక్ష్మి, ఎంపిడిఓ నాగేశ్వరరావు, తహశీల్దార్ అప్పారావు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.