కృష్ణ

రూ.186 కోట్లతో సాగరు కాలువల ఆధునికీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, మే 24: నాగార్జున సాగరు ఎడమ కాలువ మూడో జోన్ పరిధిలో 186 వ్యయంతో నాగార్జున సాగరు కాలువల ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని సాగరు ఇఇ ఎన్ అర్జునరావు తెలిపారు. నూజివీడు డివిజన్ పరిధిలో 75 సాగునీటి వినియోగదారుల సంఘాల నేతృత్వంలో 29 ప్యాకేజీలుగా విభజించి 186 కోట్ల రూపాయలు పనులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ వై పుల్లయ్య చౌదరి, జలవనరుల శాఖ ఎపెక్స్ కమిటీ సభ్యులు ఆళ్ళ గోపాలకృష్ణతో పాటు వివిధ అధికారులతో మంగళవారం జరుగుతున్న పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇఇ అర్జునరావు మాట్లాడుతూ జరుగుతున్న పనులు నాణ్యతతో, వీలైనంత త్వరలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటి వరకు కాలువల పూడిక తీత, కట్టలు బలపర్చడం, సిమెంట్ కట్టడాలకు సంబంధించి 61 కోట్ల రూపాయల పనులు పూర్తి అయ్యాయని చెప్పారు. జలవనరుల శాఖ ఎపెక్స్ కమిటీ సభ్యులు ఆళ్ళ గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు, రాష్ట్ర విభజన వల్ల 3వ జోన్‌కు సాగరు జలాలు తీసుకువచ్చేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ కష్టసాధ్యంగా తయారైందని చెప్పారు. గోదావరి జలాలను చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా వేంపాడు మేజరు 117 కిమీ వద్దకు నీరు తీసుకువచ్చేందుకు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కృషి చేస్తున్నారని చెప్పారు. నీరు విడుదల చేసే లోపే కాలువల పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ వై పుల్లయ్య చౌదరి మాట్లాడుతూ కాంట్రాక్టర్లు సాగరు కాలువల పనులను సకాలంలో పూర్తి చేయాలని కోరారు. కాంట్రాక్టర్లు సక్రమంగా పనులు చేయకపోతే వారిని తొలగించాలని సూచించారు. సమావేశంలో డిసి ఛైర్మన్లు తుమ్మల నాగేశ్వరరావు, నాదెండ్ల చెన్నకేశవరావు, సుంకర కృష్ణమోహన్, దేవభక్తుని సీతారామప్రసాద్, సాగరు అధికారులు జి శ్రీనివాసరావు, పరమహంస, రవీంద్రబాబు, శ్రీనివాస చక్రవర్తి పాల్గొన్నారు.