కృష్ణ

మత్స్య సహకార సంఘ పాలకవర్గం ఎన్నిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మే 24: జిల్లా మత్స్య సహకార సంఘం నూతన పాలకవర్గ ఎన్నిక ఎట్టకేలకు మంగళవారం జరిగింది. హైకోర్టు ఆదేశాల మేరకు నిలిచిపోయిన ఎన్నిక లైన్ క్లియర్ కావటంతో నిర్వహించారు. అధ్యక్షునిగా తమ్ము ఏడుకొండలు, ఉపాధ్యక్షునిగా తిరుమలశెట్టి మార్కండేయులు ఏకగ్రీవంగా ఎన్నికవ్వగా మరో తొమ్మిది మందిని డైరెక్టర్లుగా ఎన్నుకున్నారు. జిల్లా మత్స్య సహకార సంఘ ఎన్నికలను మార్చి 18న నిర్వహించారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణపై కొందరు హైకోర్టును ఆశ్రయించగా ఎన్నికల ఫలితాలను నిలుపుదల చేశారు. అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక కూడా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 28న ఫలితాల ప్రకటన, అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో మంగళవారం ఫలితాలు ప్రకటించిన మత్స్య శాఖాధికారులు నూతన పాలకవర్గ ఎన్నిక నిర్వహించారు. మొత్తం 11 మంది డైరెక్టర్లను ఎన్నుకున్నారు. వీరిలో గిలకలదిండికి చెందిన ఏడుకొండలు అధ్యక్షునిగా, తుమ్మలచెరువు చెందిన మార్కండేయులు ఉపాధ్యక్షునిగా ఎన్నికయ్యారు. లంకే మునేంద్రరావు, లకనం నాగాంజనేయులు, మోకా విష్ణువర్ధనరావు, నువ్వుల సుబ్బయ్య, పెదసింగు సామేరు, మోకా మోహనరావు, కొక్కిలిగడ్డ నాగ రమేష్, లంకే రంగారావు, విష్ణుమూర్తుల శ్రీనివాసరావు డైరెక్టర్లుగా ఎన్నికయ్యారు. నూతన పాలకవర్గాన్ని జెడ్పీటిసి లంకే నారాయణప్రసాద్, బంటుమిల్లి మార్కెట్ యార్డు చైర్మన్ వాటాల నరసింహస్వామి, జిల్లాలోని పలు మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు అభినందించారు. కార్యక్రమంలో ఫిషరీస్ ఎడి జయరావ్ పాల్గొన్నారు.