కృష్ణ

‘ఆర్‌కే’కే బందరు జనసేన టికెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: బందరు అసెంబ్లీ నియోజకవర్గ జనసేన అభ్యర్థిత్వాన్ని ఎట్టకేలకు ప్రముఖ వ్యాపార వేత్త, విద్యా వేత్త, ఆర్‌కె గ్రూప్స్ ఆఫ్ చైర్మన్ బండి రామకృష్ణ (ఆర్‌కె) దక్కించుకున్నారు. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గత గురువారం రాత్రి 32 మంది పేర్లతో విడుదల చేసిన తొలి జాబితాలో బందరు అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఉండటం విశేషం. బందరు జనసేన పార్టీ తరఫున ఇప్పటి వరకు ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ, చిలంకుర్తి పృధ్వి ప్రసన్న, వాలిశెట్టి మల్లి వంటి వారు పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా బండి రామకృష్ణ తెర మీదకు వచ్చి జనసేన టికెట్‌ను కైవసం చేసుకున్నారు. రామకృష్ణ అభ్యర్థిత్వం పట్ల జనసైనికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. శుక్రవారం జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బండి రామకృష్ణను కలిసి అభినందనలు తెలియచేశారు. ఓ చిన్నపాటి టీ దుకాణంతో వ్యాపారాన్ని ప్రారంభించిన ఆర్‌కె నేడు ఆర్‌కె గ్రూప్స్ ఆఫ్ చైర్మన్‌గా ఎదిగారు. అన్ని వర్గాల ప్రజలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. స్వయం కృషితో పైకి వచ్చిన రామకృష్ణకు పవన్ కల్యాణ్ ఏరికోరి మరీ జనసేన టికెట్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఆర్‌కె అంటే మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు తెలియని వ్యక్తి కాదు. వివాదాలకు దూరంగా ఉంటూ వ్యాపార రంగంలో ముందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన రెండు రాజకీయ పార్టీలకు రామకృష్ణ ధీటైన పోటీ ఇస్తారని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు.