కృష్ణ

సిట్టింగ్‌లకే టికెట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థుల జాబితాను గురువారం ప్రకటించింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు సిట్టింగ్‌లకే మరోసారి అవకాశం ఇచ్చారు. జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలు, రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా మిగిలిన 14 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేశారు. గత ఎన్నికల్లో రెండు పార్లమెంట్ స్థానాలతో పాటు 10 అసెంబ్లీ స్థానాలను తెలుగుదేశం పార్టీ చేజిక్కించుకుంది. పామర్రు, విజయవాడ వెస్ట్ వైసీపీ ఎమ్మెల్యేలైన ఉప్పులేటి కల్పన, జలీల్ ఖాన్ పార్టీ ఫిరాయింపుతో ఆ సంఖ్య 12కు చేరింది. గతంలో టీడీపీ తరఫున పోటీ చేసిన గెలుపొందిన 10 మందిలో తొమ్మిది మందికి మరోసారి పోటీ చేసేందుకు చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వైసీపీ నుండి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల్లో జలీల్ ఖాన్‌కు బదులుగా ఆయన కుమార్తె షబానా ఖాతూన్‌కు అవకాశం ఇచ్చారు. పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనకు రాత్రి పొద్దుపోయన తర్వాత టికెట్ ఖరారయంది. ఇదిలా ఉండగా గత ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా బీజేపీకి కేటాయించిన కైకలూరు స్థానాన్ని ఈ విడత జయమంగళ వెంకట రమణకు ఖరారు చేశారు. జయమంగళ వెంకట రమణ 2004 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కైకలూరు టికెట్ కోసం మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్, కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ పోటీ పడగా జయమంగళ అభ్యర్థిత్వానే్న అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. గుడివాడ, తిరువూరు నియోజకవర్గాల్లో ఈ విడత అభ్యర్థులను చంద్రబాబు మార్చారు. గత ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాలను టీడీపీ చేజార్చుకుంది. గుడివాడ నుండి రావి వెంకటేశ్వరరావు పోటీ చేయగా తిరువూరు నుండి నల్లగట్ల స్వామి దాసు పోటీ చేశారు. ఈ విడత ఎన్నికల్లో గుడివాడలో వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానిని తలదనే్నందుకు సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన దివంగత మాజీ మంత్రి దేవినేని నెహ్రూ వారసుడిగా దేవినేని అవినాష్‌ను చంద్రబాబు బరిలో నిలిపారు. ఎక్సైజ్ శాఖ మంత్రిగా పని చేస్తున్న కెఎస్ జవహర్‌ను ఈ విడత తిరువూరు ఎస్సీ రిజర్వు నియోజకవర్గం నుండి పోటీకి దింపారు. ఒక్కసారిగా తిరువూరు టికెట్‌ను జవహర్‌కు కేటాయించడం పట్ల తిరువూరు నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇప్పటి వరకు పార్టీకి సేవ చేస్తూ వచ్చిన నల్లగట్ల స్వామిదాసుకు మద్దతుగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్ల మీదకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. పెడన, నూజివీడు నియోజకవర్గ అభ్యర్థిత్వాల పట్ల రాత్రి పొద్దుపోయే వరకు స్పష్టత రాలేదు. నేడో రేపో ఈ రెండు నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.