కృష్ణ

బందరు పార్లమెంట్ ‘తెదేపా’ అభ్యర్థిత్వంపై ఎడతెగని ఉత్కంఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, : మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వంపై ఎడతెగని ఉత్కంఠత నెలకొంది. పార్లమెంట్ అభ్యర్థిగా అధిష్ఠానం ఎవరిని బరిలో నిలుపుతుందనేది చర్చనీయాంశంగా మారింది. సిట్టింగ్ ఎంపీ కొనకళ్ల నారాయణరావుకే దాదాపు అభ్యర్థిత్వం ఖరారైన నేపథ్యంలో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ సమీకరణలు రకరకాల ఊహాగానాలకు తెర లేపింది. నిన్న మొన్నటి వరకు వంగవీటి రాధాకృష్ణ పేరును వినిపించగా ఇప్పుడు అనూహ్యంగా మాజీ డెప్యూటీ స్పీకర్, ముడ చైర్మన్‌గా కొనసాగుతున్న బూరగడ్డ వేదవ్యాస్ పేరు తెర మీదకు వచ్చింది. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన వేదవ్యాస్‌ను పార్లమెంట్ బరిలో నిలిపి సిట్టింగ్ ఎంపీ కొనకళ్ల నారాయణరావును పెడన అసెంబ్లీ నుండి పోటీ చేయించాలనే ఆలోచనలో అధినేత చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వంగవీటి రాధాకృష్ణతో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. తొలుత వంగవీటిని బందరు పార్లమెంట్ బరిలో నిలవాలని చంద్రబాబు సూచించారు. అయితే అనుకోకుండా రాధా స్థానంలో వేదవ్యాస్ పేరు తెర మీదకు రావటంతో సరికొత్త ప్రచారానికి తెర లేపినట్టైంది. ఇదే విషయమై గురువారం రాత్రి జరిగిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చ జరిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. వేదవ్యాస్ తనయుడు కిషన్ తేజకు, సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉంది. అదీ కాకుండా రాజకీయాల్లో బూరగడ్డ కుటుంబానికి ఒక ప్రత్యేక స్తానం ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బూరగడ్డకు ఎంపీ సీటు ఇచ్చినా ఆశ్చర్యపోవల్సిన అవసరం లేదని రాజకీయ విశే్లషకులు పేర్కొంటున్నారు.
‘పది’లో మెరుగైన ఫలితమే లక్ష్యం
* పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
* విద్యార్థులు ఒత్తిళ్లకు గురి కావొద్దు
* ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి
* జిల్లా విద్యాశాఖాధికారిణి ఎంవి రాజ్యలక్ష్మి

మచిలీపట్నం, మార్చి 11: పదవ తరగతి పరీక్షల్లో జిల్లాకు మెరుగైన ఫలితాల సాధనే లక్ష్యంగా విద్యా బోధన జరిగిందని జిల్లా విద్యా శాఖాధికారిణి ఎంవి రాజ్యలక్ష్మి తెలిపారు. మరో మూడు రోజుల్లో పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శుక్రవారం ఆమె తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను వివరించారు. జిల్లాలో ఒత్తిడి లేని విద్యా బోధన జరిగిందన్నారు. ఉపాధ్యాయుల బోధనా సామర్ధ్యాన్ని కూడా పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. ముఖ్యంగా డిజిటల్, వర్చువల్ తరగతుల ద్వారా విద్యార్థులకు శులభరీతిలో అర్ధమయ్యే విధంగా పాఠ్యాంశాలను బోధించినట్లు చెప్పారు. సత్ఫలితాల కోసం ప్రవేశ పెట్టిన దశ సూత్రాల మీద తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. దశసూత్రాలే మెరుగైన ఫలితాన్ని తీసుకు వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఒత్తిళ్లకు గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుండి సూచనలు, సలహాలు తీసుకునేందుకు గాను ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నెం.6301067397 ద్వారా సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. ఈ నెల 18వ తేదీ నుండి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయన్నారు. ఏప్రిల్ 3వతేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షల సందర్భంగా విద్యా శాఖ చేపట్టిన ఏర్పాట్లు, విద్యార్థులు తీసుకోవల్సిన జాగ్రత్తలపై ఆమె ఈ విధంగా వివరించారు.
* 269 కేంద్రాల ద్వారా 56,189 మంది ప్రైవేట్, రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు.
* 269 కేంద్రాలను మూడు కేటగిరిలుగా విభజించారు. ఎ కేటగిరి కింద 154, బి కేటగిరి కింద 45, సి కేటగిరి కింద 70 కేంద్రాలు ఏర్పాటు చేశారు.
* ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్, ఒక చీఫ్ సూపరింటెండెంట్‌ను నియమించారు.
* సుమారు 3వేల మంది ఇన్విజిలేటర్ల నియామకాన్ని చేపట్టారు.
* ప్రతి మూడు రోజులకు జంబ్లింగ్ విధానంలో ఇన్విజిలేటర్లకు విధుల కేటాయింపు చేయనున్నారు.
* మాస్ కాపీయింగ్ నిరోధానికి 14 ఫ్లయింగ్ స్క్వాడ్స్, సి కేటగిరిలోని 70 కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేశారు.
* 22 మంది చొప్పున రూట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ రూట్ ఆఫీసర్ల నియామకం చేపట్టారు.
* మంతెన, జగ్గయ్యపేట, పెదతుమ్మిడి, గుడివాడ, ఊటుకూరు జెడ్పీ హైస్కూల్స్‌ల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
* ప్రతి పరీక్షా కేంద్రంలో ఒక ఎఎన్‌ఎమ్‌తో వైద్య శిబిరం, మంచినీటి వసతి కల్పించారు.
* ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్‌ను అమలు చేయనున్నారు.
* ఏపీఎస్‌ఆర్‌టీసీ ద్వారా మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
* విద్యార్థులు పరీక్ష రాసేందుకు వీలుగా ఫర్నిచర్ ఏర్పాటు చేశారు.