కృష్ణ

నూజివీడు టీడీపీ అభ్యర్థిగా ముద్దరబోయిన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, : నూజివీడు టీడీపీ అభ్యర్థిగా మాజీ శాసనసభ్యుడు, నూజివీడు నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావుని ఖరారు చేస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అధికారికంగా ప్రకటించారు. నూజివీడు సీటుకు సంబంధించి మూడు రోజుల నుండి పార్టీ శ్రేణులు రోజూ పార్టీ అధిష్టానవర్గం దగ్గరకు వెళ్ళి వారి వాదనలు వినిపిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో నూజివీడు పంచాయతీ జరిగింది. ఈ పంచాయతీలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కాపా శ్రీనివాసరావు, పార్టీ నాయకులు నూతక్కి వేణుగోపాలరావు, మోరంపూడి శ్రీనివాసరావు, సీటు ఆశిస్తున్న ఆశావహులు అట్లూరి రమేష్ తదితరులు ముద్దరబోయినకు వ్యతిరేకంగా వాదన వినిపించారు. బీసీ సామాజిక వర్గానికి సీటు కేటాయించాల్సి వస్తే టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడుకి కేటాయిస్తే, గెలిపించి తీసుకువస్తామని వీరు స్పష్టం చేశారు. పార్టీ ఇన్‌చార్జిగా ఉన్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావును కాదని వేరొకరికి టిక్కెట్ ఇచ్చి ప్రయోగం చేసే స్థితిలో లేమని, విభేదాలు వీడి పార్టీ విజయానికి అందరూ సమష్టిగా కృషి చేయాలని చంద్రబాబు సూచించారు. నూజివీడులో టీడీపీ గెలిస్తే మీ అందరి బాధ్యత నేను చూసుకుంటా, లేకుంటే మీరే ఇబ్బంది పడతారని హెచ్చరించారు. పార్టీ ఓటమి చెందిన నియోజకవర్గాలలో అక్కడ ఓడిపోయిన అభ్యర్థిని ఇన్‌చార్జిలుగా నియమించి తప్పు చేశానని, భవిష్యత్‌లో ఇలాంటి తప్పులు చేయకుండా అయిదుగురితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తానని చెప్పారు. అందరినీ కలుపుకుని వెళ్ళాలని ముద్దరబోయినకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. దీంతో నూజివీడు నియోజకవర్గం అభ్యర్థి ఎంపికపై వారం రోజుల నుండి నడుస్తున్న రాజకీయ ఊహాగానాలకు తెరపడింది.

వివేకాకు ఘన నివాళులు
మైలవరం, మార్చి 15: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డికి మైలవరం వైకాపా నేతలు ఘన నివాళులర్పించారు. వివేకా మరణవార్త వినగానే స్థానిక వైకాపా కార్యాలయంలో వివేకా చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మృదుస్వభావి, మచ్చలేని నాయకుడు వివేకానందరెడ్డిని హతమార్చటం ముష్కరుల చర్యగా అభివర్ణించారు. ఈసంఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి దోషులెంతటి వారైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పామర్తి శ్రీనివాసరావు, పట్టణ పార్టీ అధ్యక్షులు అబ్దుల్ కరీమ్, ఎంపిటిసి అబ్దుల్ రహీమ్, కోట పుల్లారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
క్రీడా పోటీలలో ఎల్బీఆర్సీఇ విద్యార్థుల ప్రతిభ
మైలవరం, మార్చి 15: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఇంటర్ కాలేజీయేట్ టోర్నమెంట్ సెంట్రల్ జోన్‌లో స్థానిక లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచినట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె అప్పారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈటోర్నమెంట్‌లో తమ కళాశాలకు చెందిన విద్యార్థులు బాల్ బాడ్మింటన్‌లో నాల్గవ స్థానం సాధించినట్లు తెలిపారు. అదేవిధంగా నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన నేషనల్ ఫెస్ట్‌లో, ఖోఖోలో ప్రధమ స్థానం సాధించినట్లు తెలిపారు. అదేవిధంగా ఈనెల మొదటి వారంలో జరిగిన అథ్లెటిక్స్ ఇంటర్ కాలేజీయేట్ టోర్నమెంట్ సెంట్రల్ జోన్ పురుషుల విభాగంలో ఆర్ ప్రవీణ్ హైజంప్‌లో తృతీయ స్థానం, మహిళల విభాగంలో జె సంధ్య లాంగ్ జంప్‌లో తృతీయ స్థానం సాధించినట్లు తెలిపారు. ఈసందర్భంగా విజేతలను, వీరికి శిక్షణ ఇచ్చిన కళాశాల పిడి ఎన్వీ రాజ్‌కుమార్, దుర్గారెడ్డి, ఎం సత్య సుగుణలను కళాశాల ప్రెసిడెంట్ జి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్ కె అప్పారావు, వైస్ ప్రిన్సిపాల్ కె శ్రీనివాసరెడ్డి, అధ్యాపకులు అభినందించారు.