కృష్ణ

20, 21 తేదీల్లో విశ్వనాధపల్లి శ్రీ నాంచారమ్మ తల్లి జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోడూరు, : కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలకు ఇలవేల్పుగా, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పేరుగాంచిన విశ్వనాధపల్లిలో కొలువైయున్న శ్రీ అద్ధంకి నాంచారమ్మ తల్లి జాతర ఈ నెల 20, 21 తేదీల్లో ఘనంగా జరగనుంది. ఆలయ పాలకమండలి సభ్యులు తోట సూర్య మోహనరావు, కార్యనిర్వహణాధికారి తిక్కిశెట్టి వీర వెంకట మోహనరావు, కమిటీ సభ్యుల సహకారంతో గుడి చుట్టూ భారీ బందోబస్తు చేస్తున్నారు. అవనిగడ్డ సబ్ డివిజన్ పరిధిలోని 250 మంది పోలీసులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసు బందోబస్తు తీసుకున్నట్లు అవనిగడ్డ డీఎస్పీ పోతురాజు తెలిపారు. అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించేందుకు, మొక్కులు తీర్చుకునేందుకు గుంటూరు జిల్లా నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఎడ్లబండిపై తరలి వచ్చే వారు అందుకు గాను విశ్వనాధపల్లి పంట పొలాల్లో వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకు మినుము కోతలను కూడా పూర్తి చేసి గ్రామస్థులు తోడ్పాటును అందిస్తున్నారు. రేపల్లె, అవనిగడ్డ డిపోలు నుంచి ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకున్నారు. వి కొత్తపాలెం లాకుల వద్ద నుంచి విశ్వనాధపల్లికి వెళ్లే రోడ్డు ఇరుకుగా ఉండటంతో గుడి దక్కరకు వెళ్లే వాహనాలు గుడి చుట్టూ తిప్పిన తరువాత నరసింహపురం మీదుగా కోడూరు వచ్చి కోడూరు నుంచి అవనిగడ్డ రూటులో బయటకు వెళ్లాలని రూట్ మ్యాప్ నిర్దేశించినట్లు కోడూరు ఎస్‌ఐ ప్రియ కుమార్ తెలిపారు.
స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి - ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి

మచిలీపట్నం, మార్చి 15: రాజ్యాంగం కల్పించిన ఓటును ప్రతి ఒక్కరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకుని మన భవిష్యత్తును తీర్చిదిద్దే పాలకులను ఎన్నుకోవాలని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అన్నారు. శుక్రవారం స్థానిక సెయింట్ ఫ్రాన్సిస్ హైస్కూల్‌లో ఓటు హక్కు ప్రాధాన్యతపై జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహనా సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ త్రిపాఠి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించామన్నారు. ప్రలోభాలకు లొంగి ఓటును అమ్ముకోవద్దన్నారు. నీతి నిజాయితీలతో కూడిన వ్యక్తులను పాలకులుగా ఎన్నుకునే అవకాశాన్ని రాజ్యాంగం మనకు ఓటు ద్వారా ఇచ్చిందన్నారు. దాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలే తప్ప దుర్వినియోగం చేయరాదన్నారు. ఓటు ద్వారా సమాజంలో మార్పు మాత్రమే కాకుండా శాసన వ్యవస్థలో కూడా మార్పు వస్తుందన్నారు. రాజరిక వ్యవస్థలో రాజే నిర్ణేతగా ఉండేవాడని, కానీ నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే నిర్ణేతలన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నిస్పక్షపాతంగా రాగద్వేషాలకు అతీతంగా వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సోమంచి సాయికృష్ణ, డీఎస్పీ మొహబూబ్ బాషా, సీఐలు వాసవి, రమణ, రవికుమార్, దుర్గా ప్రసాద్, ఎస్‌ఐలు పాల్గొన్నారు.