కృష్ణ

కొనకళ్ల, కేశినేనిలకే ఎంపీ అభ్యర్థిత్వాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: అధికార తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎంపీలకే సీట్లు కేటాయించింది. మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతున్న కొనకళ్ల నారాయణరావు, విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శ్రీనివాస్ (నాని)ల అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది. ఈ మేరకు సోమవారం రాత్రి కానూరు సిద్దార్ధ కళాశాలలో జరిగిన బహిరంగ సభలో సీఎం ప్రకటించటంతో పాటు రాష్ట్రంలోని 25 పార్లమెంట్ స్థానాల అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. తొలి నుండి విజయవాడ పార్లమెంట్‌కు కేశినేని నాని పేరే వినిపిస్తోంది. ఈ మేరకు ఆయన ఎన్నికల ప్రచారం సైతం చేసుకుంటున్నారు. మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిత్వంపైనే కొన్ని అనుమానాలు నెలకొన్నాయి. ఒకానొక దశలో సిట్టింగ్ ఎంపీ కొనకళ్ల నారాయణరావును పెడన అసెంబ్లీ నుండి పోటీ చేయించాలని అధినేత భావించారు. అయితే పెడన అసెంబ్లీ స్థానం సిట్టింగ్ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్ తనయుడు కృష్ణప్రసాద్‌కు కేటాయించటంతో ఆ అనుమానాలకు తెరపడింది.

సమగ్ర సమాచారంతో మీడియా సెల్

మచిలీపట్నం, మార్చి 19: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సమగ్ర సమాచారం కొరకు కలెక్టరేట్ ప్రాంగణంలో మీడియా సెల్ ఏర్పాటు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ మీ కోసం రిసెప్షన్ హాలులో ఏర్పాటు చేసిన మీడియా సెల్‌ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలు, 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి సమగ్ర సమాచారం మీడియా సెల్‌లో పొందుపర్చడం జరిగిందన్నారు. ఎన్నికల షెడ్యూల్, నియోజకవర్గాల మ్యాప్‌లతో పాటు ఆర్‌ఓలు, ఎఆర్‌ఓలు, సెక్టోరల్ అధికారుల వివరాలు, నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి సమాచారాన్ని డిస్‌ప్లే చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ ఇన్‌ఛార్జ్ డెప్యూటీ డైరెక్టర్ భాస్కర నారాయణ, డివిజనల్ పీఆర్‌ఓ ఐ కాశయ్య, ఎపీఆర్‌ఓలు శ్రీనివాస్, అలీ తదితరులు పాల్గొన్నారు.