కృష్ణ

ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాన్ని సమస్యాత్మక, వ్యయభరితంగా గుర్తించినందున వివిధ బృందాల్లో నియమితులైన ఎన్నికల అధికారులు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ వ్యయ పరిశీలకుడు, ఐఆర్‌ఎస్ అధికారి ఉమా శంకర ప్రసాద్ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల వ్యయ పరిశీలన బృందాలు, అధికారులకు ఒక రోజు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఖర్చు పెట్టే వ్యయాన్ని ఖచ్చితంగా నమోదు చేయాలన్నారు. రూ.10వేలు మించి ఖర్చు పెడితే బ్యాంక్ ద్వారా లావాదేవీలు నిర్వహించాలన్నారు. రూ.10వేలు లోపు అయితే నగదు చెల్లింపులు చేసుకోవచ్చన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుండి వివిధ రాజకీయ పార్టీలు ఖర్చు పెడుతున్న ఖర్చును రిజిష్టర్ చేయాలన్నారు. అదే విధంగా వీడియో వివింగ్ బృందాలు బహిరంగ సభల ప్రారంభం నుండి చివరి వరకు రికార్డు చేయాలన్నారు. దీనికి సంబంధించిన సమయం తదితర అంశాలు నమోదు చేయాలన్నారు. అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా చేసే ఖర్చును ఆయా పార్టీల ఖాతాకు వెళుతుందన్నారు. ప్రచారాల్లో పాల్గొన్న ప్రతి వాహన సంఖ్య కనిపించే విధంగా ఉండాలన్నారు. వాహనంపై రిటర్నింగ్ అధికారి సంతకంతో ఒర్జినల్ జారీ పత్రాన్ని అంటించాలన్నారు. జిరాక్స్ కాపీలను అనుమతించేది లేదన్నారు. ద్విచక్ర వాహనాలకు ఎటువంటి అనుమతులు లేవని, పార్టీ గుర్తులతో జెండాలు కడితే అలాంటి ద్విచక్ర వాహనాలకు పెట్రోలు ఛార్జీలు, అభ్యర్థి, పార్టీల ఖాతాలో నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రచారాల్లో పాల్గొనే పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థుల ఖర్చులు సమానంగా వారి ఖాతాల్లో నమోదు చేయాలన్నారు. మద్యాన్ని నియంత్రించేందుకు ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం, పెడన అసెంబ్లీ నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు జయగణేష్, జిల్లా వ్యయ పరిశీలన మానిటరింగ్ సెల్ నోడల్ అధికారి ఆనందబాబు, కమిటీ సభ్యులు విఎన్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో రెండో రోజు రెండు నామినేషన్లు

మచిలీపట్నం, మార్చి 19: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణలో భాగంగా రెండవ రోజైన మంగళవారం జిల్లాలో రెండు నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా సోమవరపు రాఘవులు, విజయవాడ తూర్పు నియోజకర్గానికి నవరంగ్ కాంగ్రెస్ అభ్యర్థిగా సుందర్ రజనీకాంత్ పులవర్తి ఒక్కొక్క సెట్ నామినేషన్ దాఖలు చేశారన్నారు. తొలి రోజు ముగ్గురు వ్యక్తులు నాలుగు నామినేషన్లు దాఖలు చేయగా మొత్తం ఆరు నామినేషన్లు దాఖలైనట్లు కలెక్టర్ తెలిపారు.