కృష్ణ

ఎన్నికల్లో మలి ఘట్టానికి శ్రీకారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మరో ఘట్టానికి అధికారులు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే నామినేషన్ల ఘట్టం ప్రారంభం కాగా మంగళవారం ఇవిఎంల ర్యాండమైజేషన్‌కు శ్రీకారం చుట్టారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిథుల సమక్షంలో తొలి దశ ర్యాండమైజేషన్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ ప్రారంభించారు. పోలింగ్‌కు సంబంధించి 12వేల 764 ఇవిఎంలు, 9వేల 548 కంట్రోల్ యూనిట్లు, 9వేల 976 వీవీ ప్యాట్స్‌ను అధికారులు సిద్ధం చేశారు. ఎన్నికల కమిషన్ అనుమతితో 3వేల 968 పోలింగ్ కేంద్రాలకు ఏర్పాటు చేశారు. అలాగే అదనంగా మరో 127 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఇవిఎంల ర్యాండమైజేషన్‌కు సంబంధించి తొలి దశ నియోజకవర్గాల వారీగా కేటాయింపులు చేపట్టారు. ఇవిఎం యూనిట్ ఐడీ నెంబరు ఆధారంగా కంప్యూటర్ ద్వారా ర్యాండమైజేషన్ చేశారు. రెండవ దశలో నియోజకవర్గాలకు కేటాయించిన ఇవిఎంలను ఆయా నియోజకవర్గ పోలింగ్ కేంద్రాలకు ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించనున్నట్లు కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. అప్పుడు కూడా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనే ర్యాండమైజేషన్ జరుగుతుందని తెలిపారు. పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య 16కు మించితే రెండవ ఇవిఎం వినియోగించనున్నట్లు తెలిపారు. పోలింగ్ స్టేషన్ల సంఖ్య కంటే అదనంగా 20 శాతం ఇవిఎంలను రిజర్వులో పెట్టామన్నారు. అభ్యర్థుల నేర చరిత్ర, ప్రభుత్వ బకాయిలు ఏమైనా ఉంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ముందుగా ప్రకటించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ర్యాండమైజేషన్ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, జిల్లా రెవెన్యూ అధికారి ఎ ప్రసాద్, ఆర్డీవో జె ఉదయ భాస్కర్, డీఐఓ శర్మ, వివిధ రాజకీయ పక్షాలకు చెందిన ప్రతినిథులు కొడాలి శర్మ, మోదుమూడి రామారావు, పివి గజేంద్రరావు, బచ్చుల అనీల్, కె నాగరాజు, కోకా ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు.