కృష్ణ

కబేళాకు తరలిస్తున్న గోవుల పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: దైవంతో సమానమైన గోవులను అక్రమంగా కబేళాకు తరలిస్తుండగా పట్టుకున్న సంఘటన ఇది. మైలవరం శ్రీ సాయి సేవాదళ్, హిందూ ధర్మ ప్రచార పరిషత్ జిల్లా కార్యవర్గ సభ్యులు వి బాలాజీ ప్రసాద్ ఆధ్వర్యంలో సభ్యులు ఏకమై రాజమండ్రి నుండి హైదరాబాద్‌కు తరలిస్తున్నారన్న సమాచారం మేరకు మైలవరంలో వలపన్ని రెండు లారీలను పట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 16 ఆవులు, 17 గిత్తలను తిరిగి సాయి సేవాదళ్ సమాజానికి అప్పగించారు. వీటిని తమ ఆధీనంలో ఉంచుకుని పోషిస్తున్నారు. మినీ లారీలలో వీటిని ఒకదానిపై ఒకదానిని వేసి తాళ్ళతో కట్టివేసి నిరంకుశంగా తరలిస్తున్నారు. అంతేగాక కొన్ని గోవుల కాళ్ళను నిర్ధాక్షిణ్యంగా విరగకొట్టి ఒకదానిపై ఒకదానిని వేసి తమ కర్కశత్వాన్ని చాటుకున్నారు. వీటిని హైదరాబాద్‌లోని కబేళాకు తరలించి హోటళ్ళకు మాంసం కింద అమ్మకానికి పెడుతున్నారు. స్వాధీనం చేసుకున్న గోవులను, గిత్తలను తమ ఆధీనంలో ఉంచుకుని వాటిని పోషిస్తున్నామని, అవసరమైన రైతులకు నిబంధనల ప్రకారం అప్పగిస్తామని తెలిపారు. చిన్నచిన్న వాహనాలలు ఎక్కువ సంఖ్యలో గోవులను, గిత్తలను తరలించే క్రమంలో వాటికి అనారోగ్యం సంభవిస్తే స్థానికంగా ఉన్న పశు వైద్యులను సంప్రదించినా కనీసం స్పందించటం లేదని వాపోయారు. వాటికి వైద్యం చేయాలని పలు మార్లు పశువైద్యులను కోరినా వారు రాకపోవటం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మూగజీవాల పట్ల ప్రభుత్వ పశువైద్యులు ప్రవర్తించే తీర ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. అదేవిధంగా గోవుల అక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపి సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుని అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని కోరారు.