కృష్ణ

ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్): ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు పాత్ర కీలకమని హిందూ కళాశాల అనుబంధ సంస్థల పాలకవర్గ అధ్యక్షుడు డా. బి ధన్వంతరి ఆచార్య అన్నారు. భారతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక పద్మావతి డిగ్రీ మహిళా కళాశాలలో బుధవారం ‘ఓటు-ప్రజాస్వామ్యం’ అనే అంశంపై బుధవారం కవి సమ్మేళనం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ధన్వంతరి ఆచార్య మాట్లాడుతూ ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా ఓటును సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం జరిగిన కవి సమ్మేళనంలో కళాశాల ప్రిన్సిపాల్ టి మాలతీ రేఖ, అధ్యాపకులు మేరీ కృపాబాయి, పద్మశ్రీ, నిర్మలజ్యోతి, ప్రముఖ కవులు పన్యారం సాంబశివరావు, డి దత్తాత్రేయ శర్మ, వక్కలంక రామకృష్ణ, వి పూర్ణచంద్రరావు, ముదిగొండ శాస్ర్తీ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ రాసిన కవితను తహశీల్దార్ సునీల్‌బాబు వినిపించారు. విద్యార్థినులు దీప్తి, శరణ్య, కోమల కుమారి, ప్రసన్న, ప్రీతి తమ కవితలను వినిపించారు. కవి సమ్మేళనానికి అధ్యక్షత వహించిన భారతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు కారుమూరి రాజేంద్రప్రసాద్ ప్రసంగిస్తూ మహిళలు, విద్యార్థినులను చైతన్యపర్చేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.