కృష్ణ

ఎమ్మెల్సీ పోలింగ్‌కు రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: మరో 24 గంటల్లో ప్రారంభం కానున్న కృష్ణా, గుంటూరు పట్ట్భద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22వతేదీ ఉదయం 8గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. 26వతేదీన గుంటూరులో ఓట్ల లెక్కింపు జరిపి అదే రోజు ఫలితాలు ప్రకటించడం జరుగుతుందన్నారు. కృష్ణాజిల్లాకు సంబంధించి లక్షా 6వేల 829 మంది పట్ట్భద్రులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు గాను 153 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సరాసరి 689 మంది ఓటర్లుగా ఉన్నారన్నారు. 65వేల 501 మంది మహిళా ఓటర్లు ఉండగా 41వేల 318 మంది పురుష ఓటర్లు, 10 మంది థర్డ్ జండర్ ఓటర్లు ఉన్నారన్నారు. ఎన్నికల నిర్వహణకు డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్స్, తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బందరు రెవెన్యూ డివిజన్ పరిధిలో హిందూ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. అదే కళాశాలలో రిసెప్షన్ సెంటర్, తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గుడివాడ, నూజివీడు, విజయవాడ డివిజన్‌లకు సంబంధించి ఆయా ఆర్డీవో కార్యాలయాల్లో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగిందని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు.