కృష్ణ

మళ్లీ మనమే గెలుస్తున్నాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు: నూజివీడు తెలుగు తమ్ముళ్ళ ఆనందం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. మీ ఉత్సాహంతో నూజివీడులో టీడీపీ ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఏర్పడింది. రాష్ట్రంలో కూడా టీడీపీ ఘన విజయం సాధిస్తుంది. 175 శాసనసభ, 25 పార్లమెంట్ స్ధానాలు టీడీపీ వశం కావడం ఖాయమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. బుధవారం ఆయన నూజివీడులో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతూ ఎన్నికల అనంతరం టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, అనంతరం నూజివీడును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. నూజివీడు అభ్యర్ధిగా ముద్దరబోయిన వెంకటేశ్వరరావును ఎంపిక చేసే విషయంలో ఎన్నో సమాలోచనలు చేశా. ఆయన దగ్గర మెరిట్స్, డీ మెరిట్స్ ఉన్నాయి. అన్నింటిని పరిగణనలోకి తీసుకున్నా. పలు పర్యాయాలు సర్వేలు చేయించి, ప్రజలతో నేరుగా మాట్లాడిన అనంతరం ఎంపిక చేశానని చెప్పారు. ముద్దరబోయినకు ఉన్న బలహీనతలు కూడా స్పష్టంగా చెప్పి, వాటిని సరిదిద్దుకోవాలని హెచ్చరించానని తెలిపారు. అందరి జాతకాలు తన దగ్గర ఉన్నాయని పార్టీ శ్రేణులను హెచ్చరిస్తూ, అందరం కలిసి పనిచేస్తేనే విజయం సాధిస్తామని సిఎం చంద్రబాబు చెప్పారు. టీడీపీ అధ్యర్ధులకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. నూజివీడులో టీడీపీ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న అట్లూరి రమేష్ కూడా ప్రభుత్వంలో పోజిషన్ చూపిస్తానని అన్నారు. రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పధకాలను ఆయన వివరించారు.

దేశం తీర్థం పుచ్చుకున్న కౌన్సిలర్లు
నూజివీడు పురపాలక సంఘంకు చెందిన పలువురు వైకాపా కౌన్సిలర్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కౌన్సిలర్లు అనే్న మమత, దాసరి స్వామి, కొలుసు శోభనాచలం, మాజీ కౌన్సిలర్లు కొమరగిరి రామకృష్ణ, అనే్న జయచంద్ర శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ కౌన్సిలరు కొంపెల్ల కృష్ణకుమారి తదితరులు టీడీపీలో చేరారు. వీరందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నూజివీడు మండలం పోతురెడ్డిపల్లి గ్రామానికి చెందిన బేబీ సుజాత పది వేల రూపాయలు, రావిచర్ల గ్రామానికి చెందిన వెనిగళ్ళ వెంకటేశ్వరరావు పది వేల రూపాయలను పెద్దకుమారుడుగా సిఎం చంద్రబాబును భావిస్తూ ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ వేద పండితులు చంద్రబాబును వేదిక వద్ద ఆశీర్వదించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నూజివీడు పర్యటనను పురస్కరించుకుని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కాపా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పలువురు నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబును గజమాలతో సత్కరించగా, జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు చిట్నేని శివరామకృష్ణ నాగలి బహుకరించారు. శ్రీ సరస్వతీ దేవాలయ కమిటీ సభ్యులు సిఎం చంద్రబాబుకు శ్రీ సరస్వతీ దేవీ చిత్రపటాన్ని అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.