కృష్ణ

‘కోడికత్తి’ కుట్రలు తిప్పికొట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: ఓటు అనే ఆయుధంతో వైకాపా అభ్యర్థుల్ని తరిమికొట్టాలని మైలవరం తెలుగుదేశం అభ్యర్థి, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన అనంతరం ర్యాలీగా పార్టీ కార్యాలయం వద్దకు చేరుకుని అక్కడ జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. జెండాల కోసం, ఫ్లెక్సీల కోసం మనలో మనం గొడవలు పడొద్దని, అల్లర్లు సృష్టించాలన్న ప్రత్యర్థుల వ్యూహాలను ఛిద్రం చేయాలని కోరారు. పవిత్రమైన ఓటుతో మైలవరం నియోజకవర్గ ప్రజలు అభివృద్ధిని, పవిత్రతను కాపాడుకోవాలన్నారు. పదేళ్ళపాటు మైలవరం నియోజకవర్గంలో ఎటువంటి అశాంతి, అల్లర్లు జరగకుండా తాను బాధ్యత తీసుకుంటే కొత్తగా వచ్చిన కోడికత్తి పార్టీ అల్లర్లు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నట్లు ఆరోపించారు. మైలవరం నియోజకవర్గంలో 15వేల మంది నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చామని, 12వేల మందికి పైగా ఎన్టీఆర్ ఇళ్ళు ఇచ్చామని, 186 కోట్ల రూపాయలతో ఇంటింటికీ కుళాయి పధకం పనులు తీసుకువచ్చామని మంత్రి ఉమ తెలిపారు. అన్ని గ్రామాలలో సిసి రోడ్లు వేసినట్లు తెలిపారు. మైలవరం నియోజకవర్గంలోని రైతుల మానస పుత్రిక చింతలపూడి ఎత్తిపోతల పధకాన్ని 4,909 కోట్లరూపాయలతో చేపట్టి పనులను ప్రారంభించినట్లు తెలిపారు. తాను మైలవరంలో మూడోసారి రంగంలో నిలుస్తున్నానని, రెండు సార్లు ఆదరించిన తనను మూడోసారి ఆదరించి గెలిపిస్తే హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుని మైలవరాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేశినేని నాని మాట్లాడుతూ జగన్‌కు ఓటేస్తే దొంగలకు ఓటేసినట్లేనని ధ్వజమెత్తారు. మోడీ, కేసీఆర్, జగన్ తోడుదొంగలుగా అభివర్ణించారు. మైలవరం నియోజకవర్గంలో మంత్రి ఉమ ఎంతో అభివృద్ది చేశారని, అభివృద్ధి కొనసాగాలంటే మళ్ళీ గెలిపించాలన్నారు. అదేవిధంగా టాటా ట్రస్ట్ ద్వారా తాను ఎంతో మంది రోగులకు ఉచిత వైద్యసేవలు అందించినట్లు తెలిపారు.