కృష్ణ

అలా వచ్చి.. ఇలా వెళ్లి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామర్రు: వారం రోజుల క్రితం జనసేన పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే డివై దాస్ ఒక్కసారిగా ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పామర్రు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేసి విఫలమైన దాస్ ఈ నెల 17వ తేదీన జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. దీంతో పామర్రు జనసేన సీటు అయినదేనంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత పొత్తుల్లో భాగంగా పామర్రు నియోజకవర్గాన్ని బహుజన సమాజ్ వాద్ పార్టీకి కేటాయించటంతో దాస్ కలత చెందారు. పార్టీలో చేరిన వెంటన ప్రెస్‌మీట్ పెట్టి మరీ నీతివంతమైన పార్టీ జనసేనలో చేరినందుకు గర్వంగా ఉందని చెప్పిన దాస్ నేడు జనసేనపై తీవ్ర విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీతో జనసేన తెర వెనుక కుదుర్చుకున్న ఒప్పందం తనను తీవ్రంగా కలచి వేసిందని, ఈ కారణంతోనే తాను జనసేనకు రాజీనామా చేస్తున్నట్లు అభిమానులతో నిర్వహించిన సమావేశంలో దాస్ వెల్లడించడం గమనార్హం.

ప్రచారం ముమ్మరం చేయాలి

మచిలీపట్నం (కోనేరుసెంటరు) మార్చి 22: జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధనేకుల మురళీమోహనరావు ఆధ్వర్యంలో శనివారం సమావేశం నిర్వహించారు. పామర్రు, మచిలీపట్నం, అవనిగడ్డ, గుడివాడ నియోజకవర్గాలలో పోటీ చేసే అభ్యర్థులతో సమావేశమై వారికి ఎ, బి ఫారాలను అందచేశారు. ఈ సందర్భంగా ధనేకుల మాట్లాడుతూ అన్ని నియోజకవర్గాలలో ప్రచారం ముమ్మరంగా నిర్వహించి రాహుల్ గాంధీని ప్రధానిని చేయటానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి గొల్లు కృష్ణ, మచిలీపట్నం నియోజకవర్గ అభ్యర్థి మహమ్మద్ దాదా సాహెబ్, పామర్రు అభ్యర్థి మొవ్వ మోహనరావు, పెడన అభ్యర్థి ఎస్‌వి రాజు, అవనిగడ్డ అభ్యర్థి అందె శ్రీరామమూర్తి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు కోకా ఫణిభూషణ్, పట్టణ అధ్యక్షురాలు నల్లబోలు కుమారి, రజియా సుల్తానా తదితరులు పాల్గొన్నారు.