కృష్ణ

‘జనసేన’లోకి బాడిగ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: మాజీ పార్లమెంట్ సభ్యుడు బాడిగ రామకృష్ణ జనసేన పార్టీలో చేరతారన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. ఆదివారం మచిలీపట్నంకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ రానున్న నేపథ్యంలో ఆయన సమక్షంలోనే బాడిగ జనసేన పార్టీలో చేరుతారంటూ ఆ పార్టీ కార్యాలయంలోనే గుసగుసలు వినిపించాయి. జనసేన పార్టీ తరఫున బందరు పార్లమెంట్ అభ్యర్థిగా బాడిగ రామకృష్ణను బరిలో నిలిపేందుకు పార్టీలోని ఒక వర్గం తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తోంది. ఇప్పటికే బందరు పార్లమెంట్ జనసేన అభ్యర్థిత్వాన్ని బండ్రెడ్డి రామకృష్ణకు ఖరారు చేశారు. అయితే రామకృష్ణ పెడన సీటు ఆశించి చివరి నిమిషంలో పార్లమెంట్ అభ్యర్థిగా అధినేత సూచన మేరకు రంగంలో నిలిచారు. బరిలో నిలిచినా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు రామకృష్ణ అయిష్టత చూపుతున్నట్టు తెలుస్తోంది. ఈ కారణంతో బాడిగ రామకృష్ణను బరిలో నిలిపారని ఓ వర్గం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు వినికిడి. ఈ మేరకు బాడిగతో సంప్రదింపులు చేస్తున్నారు. కానీ బాడిగ రామకృష్ణ మాత్రం జనసేన పార్టీలో చేరే విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేనట్టు తెలుస్తోంది. చివరి నిమిషంలో పార్టీలో చేరి పోటీ చేయడం సరైన పద్ధతి కాదనేది బాడిగ భావనగా తెలుస్తోంది. తనను నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలంతా ఇప్పటికే వివిధ పార్టీల్లోకి వెళ్లారని, తాను జనసేన తరపున పోటీ చేస్తే వారు కూడా ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉందని బాడిగ ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.

నేడు వైసీపీలోకి టీడీపీ నేత ‘బూరగడ్డ’
మచిలీపట్నం, మార్చి 23: తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం తీరుపై తీవ్ర మనస్థాపంతో ఉన్న ఆ పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి బూరగడ్డ రమేష్ నాయుడు ఆదివారం ప్రతిపక్ష వైసిపిలో చేరనున్నారు. ఈ మేరకు శనివారం బూరగడ్డ రమేష్ నాయుడుని బందరు పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆయన గృహంలోనే కలిసి మంతనాలు జరిపారు. గత కొంత కాలంగా రమేష్ నాయుడు పార్టీ అధినాయకత్వం తీరు పట్ల అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో ఆయన సీనియర్ నాయకుడిగా ఉన్నప్పటికీ తగిన ప్రాధాన్యత ఇవ్వని కారణంగా వైసీపీలో చేరేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ఆదివారం తిరువూరులో జగన్ నిర్వహించే ఎన్నికల ప్రచారంలో రమేష్ నాయుడు వైసీపీ కండువా కప్పుకోనున్నారు. గతంలో ఆయన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్‌గా పని చేవారు. అవనిగడ్డ నియోజకవర్గం నుండి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.