కృష్ణ

డబ్బు సంచుల్ని వెనక్కి పంపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగాయలంక: డబ్బు సంచులతో వచ్చిన స్థానికేతరులను తరిమి కొట్టి అభివృద్ధి సారథులుగా తాను నిలబెట్టిన అభ్యర్థులకు విజయం చేకూర్చాల్సిన బాధ్యత మీపై ఉందని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన నాగాయలంక గాంధీ చౌక్ వద్ద బహిరంగ సభ నిర్వహించారు. 2014 ముందు తాను చేపట్టిన పాదయాత్ర ద్వారా ప్రత్యక్షంగా చూసిన ప్రజల కష్టాలన్నింటినీ ఈ ఐదేళ్లలో తొలగించానన్నారు. దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధిని రాష్ట్రంలో చేసి చూపించానన్నారు. ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా ప్రజల జీవన స్థితిగతులను మార్చానన్నారు. మీ అందరి సంక్షేమాన్ని బాధ్యతగా తీసుకున్నానని, రానున్న రోజుల్లో కూడా మీ సంక్షేమం, మీ భవిష్యత్తు నా బాధ్యత అన్నారు. ఏప్రిల్ 11వ తేదీన జరిగే ఎన్నికల్లో అడ్డదారిన అధికారంలోకి వచ్చేందుకు ప్రతిపక్ష వైసీపీ ప్రయత్నిస్తోందన్నారు. స్థానికేతరులను బరిలో నిలిపి డబ్బు సంచులతో పంపించారన్నారు. తమ పార్టీ కార్యకర్తలను డబ్బుతో కొనుగోలు చేయాలని చూస్తున్నారన్నారు. ఎంత డబ్బులిచ్చినా తమ పార్టీ కార్యకర్తలు వారికి అమ్ముడుపోరన్నారు. వైసీపీ ఓ దొంగల పార్టీ అని, నీతి నిజాయితీ గల వ్యక్తులు ఆ పార్టీ నుండి తమ పార్టీలోకి వచ్చేస్తున్నారన్నారు. అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు తీసుకుని తాను సమర్ధవంతమైన, ప్రజా సేవ చేసే అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలిపానన్నారు. నా అభ్యర్థిత్వం కూడా ప్రజల నుండి వచ్చిన అభిప్రాయం మేరకే ఖరారు చేసుకున్నానన్నారు. ప్రతి అభ్యర్థిలోనూ తనను చూసి ఓటు వేయాలన్నారు. ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకుగా, ప్రతి తమ్ముడికి, చెల్లెమ్మకు పెద్ద అన్నగా ఉంటానని నాడు మాట ఇచ్చానని ఆ విధంగానే తాను నడుచుకున్నానన్నారు. కాపులకు ఇచ్చిన మాట ప్రకారం కార్పొరేషన్ ఏర్పాటు చేయటం ద్వారా రూ.3200 కోట్లు సబ్సిడీ రుణాలు అందించామన్నారు. రిజర్వేషన్లపై కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామన్నారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు ఐదు శాతం ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు. నూతన రాజధాని నిర్మాణంతో పాటు 26 సాగునీటి ప్రాజెక్టులను చేపట్టామన్నారు. వీటిలో పోలవరం అత్యంత ప్రాముఖ్యత చెందినదన్నారు. నదుల అనుసంధానంతో పట్టిసీమ ద్వారా నీరు అందించామని, తద్వారా రైతాంగం అధిక ఉత్పత్తులను సాధించుకోగలిగారన్నారు. వ్యవసాయ రంగానికి అతి ప్రధానమైన పోలవరం ప్రాజెక్టు పనులు 60శాతానికి పైగా పూర్తి చేశామని, జులై నాటికి గ్రావిటీతో కూడిన నీటిని పోలవరం ద్వారా అందిస్తామన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తదుపరి ఏ రాష్ట్రంలో లేని విధంగా 24 వేల కిలోమీటర్ల మేర సిమెంటు రోడ్లను నిర్మించిన ఘనత తమకే దక్కుతుందన్నారు. వచ్చే ఏడాదికల్లా ఇంటింటికి కుళాయి పథకాన్ని అమలు చేసే విధంగా ప్రణాళిక రూపొందించామన్నారు. వివిధ వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని 25 ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసి ఆయా వర్గాలు ఆర్థికంగా నిల దొక్కుకునేందుకు రాయితీలతో కూడిన రుణాలను అందించామన్నారు. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళల ఆర్థిక పురోభివృద్ధికి దేశంలోనే మొట్ట మొదటి సారిగా మన రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయటం ద్వారా సుమారు కోటి మంది మహిళలకు ఆర్థిక ప్రయోజనాలను చేకూర్చినట్లు తెలిపారు. ఈ పరిస్థితులలో వచ్చిన ఎన్నికల్లో ఆర్థిక నేరాలకు పాల్పడిన కోడికత్తి పార్టీ నాయకుడు జగన్మోహనరెడ్డి అవగాహన రాహిత్యంతో వ్యవహరిస్తున్నారని, ఆఖరికి వారి కుటుంబ సభ్యుల హత్యలను కూడా రాజకీయంగా వాడుకోవటం అతని దీవాళాకోరుతనానికి నిదర్శనమన్నారు. మహిళా సంక్షేమానికి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పసుపు కుంకుమ కింద ప్రతి మహిళకు రూ.10వేలు అందించటం ద్వారా వారికి పెద్దన్నగా తాను నిండు మనస్సుతో వ్యవహరించానన్నారు. కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి కొనకళ్ల నారాయణరావు, అవనిగడ్డ నియోజకవర్గ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్, మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు తదితరులు పాల్గొన్నారు.