కృష్ణ

రెండేళ్లలో ‘పోర్టు’ పూర్తి చేస్తా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: బ్రిటీష్ వారి హయాంలో వర్తక, వాణిజ్య కేంద్రంగా బాసిల్లిన జిల్లా కేంద్రం మచిలీపట్నంకు ఓడరేవు నిర్మాణం ద్వారా సరికొత్త రూపు తీసుకువస్తామని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం పోర్టు పేరుతో అడిగే వాడు లేడని వేలాది ఎకరాలు రైతుల భూములను లాక్కునే ప్రయత్నం చేశారని, ఆ ప్రయత్నాలను ఇకపై సాగనివ్వబోనన్నారు. తూర్పు కృష్ణా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ బందరు పోర్టుపై తొలిసారిగా గళమెత్తారు. పోర్టు బాధితుల పక్షాన జనసేన ఉంటుందన్నారు. అవసరమైతే వారి భూముల కోసం తన ప్రాణాలను సైతం ఫణంగా పెడతానన్నారు. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లల్లో అవసరం మేర భూములు సేకరించి పోర్టు నిర్మించి చూపిస్తామన్నారు. ఈ విషయంలో ఎటువంటి అనుమానం, సందేహం లేదన్నారు. పోర్టు ద్వారానే ఈ ప్రాంతం అభివృద్ధి సాధిస్తుందని, 80వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయన్నారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ప్రాభవం కలిగిన బందరును నిర్లక్ష్యం చేశారన్నారు. రోజు రోజుకీ బందరులో జనాభా తగ్గుతుందంటే దానికి ప్రధాన కారణంగా పాలకులేనన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పోర్టు బాధిత రైతులకు పరిహారం చెల్లిస్తానన్నారు. దశాబ్దాల నాటి కల కోస్తా రైలు మార్గం ఎందుకు రాదో చూస్తానన్నారు. కోస్తా రైలు మార్గం రావాలంటే పార్లమెంట్‌లో గళం వినిపించాల్సి ఉందన్నారు. ఎంపీల రూపేణా ఆశక్తి జనసేనకు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రధాన పార్టీల ఎంపీలంతా ఇక్కడ సంపాదించిన సొమ్ము అంతా విదేశాల్లో దాచుకుంటున్నారని ఆరోపించారు. జనసేన మాత్రం విదేశాల్లో ఉన్న ఆంధ్రులను ప్రజా సేవ చేసేందుకు మీ ముందుకు తీసుకు వచ్చానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉన్న అభ్యర్థులనే తాను ఎన్నికల గోదాలోకి దించానన్నారు. వారంతా ప్రజలకు నిస్వార్ధ సేవలు అందిస్తారన్న పూర్తి విశ్వాసం తనకు ఉందన్నారు. వారందరినీ బలపర్చి విజయాన్ని అందించాల్సిన బాధ్యత జనసైనికుల మీద ఉందన్నారు. కృష్ణాజిల్లాలో విశాలమైన సముద్ర తీరం ఉందన్నారు. ఆ తీరాన్ని అభివృద్ధి చేయటంతో పాటు పర్యాటక శోభ తీసుకు వస్తామన్నారు. అసెంబ్లీకి వెళ్లని జగన్ కావాలో..? అధికారమే పరమావధిగా భావించే చంద్రబాబు కావాలో..? లేకపోతే ప్రజల పక్షాన నిలబడి పోరాడే జనసేన కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. జనసేన ప్రభుత్వం వస్తే విద్య, వైద్యం ఉచితంగా అందిస్తామన్నారు. రూ.10లక్షలు వైద్య బీమా కల్పిస్తామన్నారు. చదువుకు తగ్గ ఉపాధి లభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆక్వా రంగానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లని సమయంలో ప్రతి మత్స్యకారుడికి రోజుకు రూ.500 చొప్పున ప్రభుత్వం ద్వారా నగదు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పొలిటికల్ అడ్వైజరి కమిటీ చైర్మన్ పులి శేఖర్, మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి బండ్రెడ్డి రామకృష్ణ, అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి బండి రామకృష్ణ, జనసేన నాయకులు లంకిశెట్టి బాలాజీ, బండి విజయ్ డానియేల్, బహుజన సమాజ్ వాద్ పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు జయకర్ బాబు, గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు.

జంట నగరాలుగా బందరు, పెడన
పెడన: ఎంతో ప్రాధాన్యత, ప్రాభవం కలిగి దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్న మచిలీపట్నం, పెడన పట్టణాలను జంట నగరాలు తీర్చిదిద్దుతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి స్థానిక బస్టాండ్ సెంటరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. పాలకులు ఈ రెండు పట్టణాలను పూర్తిగా నిర్వీర్యం చేయటంతో పాటు అభివృద్ధికి ఆమడ దూరంలో పెట్టారన్నారు. పెడనలో చేనేత కార్మికుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సరైన రీతిలో స్పందిస్తుందన్నారు. సముద్ర తీర ప్రాంతమైన పెడనలో సాగునీరు కొరత లేకుండా చేస్తానన్నారు. పెడన అసెంబ్లీ అభ్యర్థి అంకెం లక్ష్మీ శ్రీనివాస్, మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి బండ్రెడ్డి రామకృష్ణలను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 60 సంవత్సరాలు నిండిన ప్రతి రైతు, మత్స్యకారులకు రూ.5వేలు పెన్షన్ అందిస్తామన్నారు. రాష్ట్రంలో జగన్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు. హామీలు ఇచ్చి విస్మరించటం టీడీపీ నైజం అన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు పలువురు పాల్గొన్నారు.