కృష్ణ

అన్ని విధాలుగా తిరువూరు అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎ కొండూరు: అభివృద్ధిలో తిరువూరు నియోజకవర్గం బాగా వెనుకబడి పోయిందని, వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో వైకాపా ఘన విజయం సాధిస్తుందని వైకాపా అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్‌మోహనరెడ్డి చెప్పారు. తిరువూరును అన్ని రంగాల్లో అబివృద్ధి చేస్తానని అన్నారు. ఆదివారం సాయంత్రం తిరువూరు పట్టణంలోని బోసు బొమ్మ సెంటరులో జరిగిన భారీ బహిరంగ సభలో పజానీకాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సాగర్ కాలువలు ఉన్నప్పటికి సకాలంలో సాగర్ జలాలు విడుదల కాకపోవడంతో పంట భూములన్ని బీడు భూములుగా మారాయాన్నారు. నూతిపాడు, తెల్లదేవరపల్లి వద్ద ఎత్తిపోతల పథకాలను దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మించినప్పటికి సాగు, తాగు నీటికి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని అన్నారు. తిరువూరు నియోజకవర్గానికి కృష్ణాజలాలు సరఫరా చేస్తామని చెప్పి శిలాఫలకాలతోనే సరిపెట్టారని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో లక్ష ఎకరాల్లో మామిడితోటలు ఉన్నప్పటికి పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని విమర్శించారు. మార్కెట్‌లో దళారులు ప్రవేశించి సిండికెట్‌లతో మిలాఖత్ అయ్యి రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు హేరిటేజ్ కంపెనీ లాభాల కోసం దళారులతో చేతులు కలిపి రైతాంగాన్ని తీరని అన్యాయానికి గురి చేస్తున్నారని విమర్శించారు. ఎ కొండూరు మండలంలో కిడ్ని వ్యాధితో 30 మంది చనిపోయినా ఈ ప్రాంతంలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోవడం చంద్రబాబు అసమర్ధపాలనకు అద్దం పడుతోందన్నారు. దేవుడు ఆశీర్వదించి వైకాపా అధికారంలోకి వస్తే పరిశ్రమల్లో స్ధానికులకే 75శాతం ఉద్యోగాలు కల్పించేలా చట్టం తెస్తానని జగన్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, అందుకు ప్రభుత్వం ప్రతి ఏటా క్యాలెండరు ప్రకటిస్తామని భరోసా కల్పించారు. ప్రభుత్వ కాంట్రాక్టు సర్వీసులు అనేకం ఉన్నాయని, ఆర్టీసీ బస్సులను కాంట్రాక్టుకు నడుపుతూ విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ జెసి బ్రదర్స్ లాంటి వాళ్ళకు అప్పగించి కోట్లాది రూపాయలు దండుకుంటున్నారని అన్నారు. తాను అధికారంలోకి వస్తే ఈ వ్యవస్థను మార్చివేసి పెట్టుబడి రాయితీతో యువతకు కార్లను పంపిణీ చేసి తగిన జీవనభృతి కల్పిస్తానన్నారు. గ్రామాల్లో 50 ఇళ్ళకు ఒక వలంటీరును నియమించి ప్రభుత్వ పథకాలు ప్రజలకు నేరుగా అందేవిధంగా చర్యలు తీసుకుని వలంటీరుకు నెలకు 5వేల గౌరవ వేతనం చెల్లిస్తానన్నారు. విద్యార్థుల చదువులకు అయ్యే ఖర్చు ఏటా 15వేలను తానే చెల్లిస్తానన్నారు. వైఎస్‌ఆర్ చేయూత కింత ప్రతి ఆడపడుచుకు 75వేలు చెల్లిస్తానని చెప్పారు. ప్రతి రైతుకు పెట్టుబడి నిధితో పాటు 50వేలు మే నెలలో పంట సాగుకు 12,500 ఇస్తానని భరోసా ఇచ్చారు. జన్మభూమి కమిటిల పేరుతో అవినీతి మాఫియాను తయారు చేసి లంచం ఇస్తేనే గాని ఏ పని చేయకుండా చేయడంలో కూడా బాబు నంబర్‌వన్‌గా ఉన్నారని జగన్ విమర్శించారు. విజయవాడ ఎంపీగా పోటీ చేస్తున్న వరప్రసాదరావు, తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధిని ప్యాను గుర్తుపై ఓటు వేసి అత్యథిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.