కృష్ణ

ఉరుములు, మెరుపులతో భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిగామ, మే 27: నందిగామ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవగా కంచికచర్ల ప్రాంతంలో భారీ ఈదురు గాలులు బీభత్సం సృష్టించింది. సాయంత్రం 5గంటల నుండి కంచికచర్ల ప్రాంతంలో భారీ ఈదురు గాలులు వీయడంతో జాతీయ రహదారిపై పోలీస్ స్టేషన్ సమీపంలో భారీ వృక్షం నేలకూలింది. దీంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోగా ఎస్‌ఐ ఈశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది పడిపోయిన వృక్షాన్ని తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ఈదురు గాలుల కారణంగా కంచికచర్లలో 30కిపైగా విద్యుత్ స్తంభాలు విరిగి పడిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులు చేసినప్పటికీ శనివారం సాయంత్రానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరుగుతుందని కంచికచర్ల విద్యుత్ ఎఇ తెలిపారు. కాగా ఇళ్ల పైకప్పులపై ఉన్న రేకులు ఈదురు గాలులకు ఎగిరి అవతల పడ్డాయి. నందిగామ ప్రాంతంలో సాయంత్రం 5 గంటల నుండి ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో జన జీవనం సుమారు మూడు గంటల పాటు స్తంభించింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తెగి పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాత్రి 9 గంటల తరువాత విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. వీరులపాడు మండలం అల్లూరు గ్రామంలో పిడుగుపాటుకు మహిళ మృతి చెందింది.