కృష్ణ

గోడ కూలి కార్మికుని మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆగిరిపల్లి, మే 27: శుక్రవారం సాయంత్రం విపరీతంగా వీచిన గాలులకు గోడ కూలి కార్మికుడు మృతి చెందగా మరొకరు గాయాలపాలలై చికిత్సపొందుతున్నాడు.. ఈ సంఘటన మండలంలోని అడవినెక్కలంలో జరిగింది. ఆగిరిపల్లికి చెందిన చిమట నరసింహారావు మండలంలోని అడవినెక్కలంలో ఉన్న ప్రైవేటు కర్మాగారంలో కాంట్రాక్టు కార్మికునిగా పనిచేస్తున్నాడు. విధులు నిర్వహిస్తున్న సమయంలో శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులు వీచాయి. ఈ తరుణంలో గోడ విరిగి అక్కడే పనులు చేస్తున్న కార్మికుడు చిమట నరసింహారావుతో పాటు మరో కార్మికుడిపై గోడ పడింది. తీవ్ర గాయాలై కార్మికులను విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యలో నరసింహారావు మృతి చెందాడు.