కృష్ణ

నేత్రపర్వంగా రాములోరి కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి: అయోధ్య పురాధీశుడు శ్రీ దశరధ మహారాజు జ్యేష్ఠ పుత్రుడు శ్రీ రామచంద్రమూర్తికి మిధిలాపురాధీసులు శ్రీ జనక మహారాజు ప్రియపుత్రిక శ్రీ సీతాదేవికి ఘనంగా ఆదివారం కల్యాణ మహోత్సవం జరిగింది. శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో కొలువైన పవన పుత్రుని సన్నిధిలో ఆదివారం ఉదయం ఈవో కే నాగరాజు సూచనతో ప్రధాన అర్చకుడు రాచకొండ సుమంత్‌శర్మ ఆధ్వర్యంలో స్వామి కల్యాణం ఘనంగా జరిగింది. అర్చకులు రాచకొండ నాగరాజుశర్మ, రాఘవేంధ్రశర్మ శాశ్వత ఉభయదాతలను పీఠాలపై కూర్చొబెట్టి ఈకార్యక్రమానికి ఘనంగా నిర్వహించారు. భక్తులకు పెద్ద ఎత్తున స్వామి ప్రసాదాలను పంపిణీ చేశారు. పాతబస్తీ కెనాల్‌రోడ్ శ్రీ బ్రహ్మచారి బావాజీ మఠంలో స్వామి కల్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వీ సత్యనారాయణ దంపతులు భక్తితో స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, పూజ సామగ్రిని సమర్పించారు. మఠం పిట్‌పర్సన్ యద్ధనపూడి శివరామయ్యనాయుడు సూచనతో అర్చకులు వీరికి ఘనస్వాగతం పలికి పట్టువస్త్రాలు, పూజా సామగ్రి స్వామికి సమర్పించి వీరిని పీఠాలపై కూర్చోబెట్టి భక్తితో కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. అధికంగా మార్వాడీ భక్తులు విచ్చేశారు. ఈకార్యక్రమంలో దేవదాయశాఖ తనిఖీ అధికారి ఏ సుజన్‌కుమార్, వివిధ దేవస్థానాలఈవోలు పాల్గొన్నారు. ఉద్యోగులు భాస్కర్‌నాయుడు, నాగరాజు భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. శివాలయం వీధి పొలమరశెట్టి వీరాస్వామి కాంప్లెక్స్ సెంటర్‌లో హాకర్స్ యూనియన్ నాయకుడు పొలమరశెట్టి వెంకన్న ఆధ్వర్యంలో స్వామికి అర్చకులు కల్యాణాన్ని నిర్వహించారు. సాయి భక్తులకు పెద్ద ఎత్తున ప్రసాదాలు పంపిణీ చేశారు. పాతబస్తీ భావన్నారాయణ వీధి శ్రీ కోదండ రామస్వామివారి దేవస్థానంలో కమిటీ చైర్మన్ కాజా లక్ష్మీ వెంకట మోహన్ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకుడు దీవి రాఘవదీక్షితులు మద్ది మాల గంగాధర్ శివ ప్రసాద్, విశాలక్ష్మీ దంపతులను చేత స్వామి కల్యాణాన్ని జరిపించారు. ఈకార్యక్రమంలో భాగంగా ఉదయం స్వామి, అమ్మవారి చిత్రపటాలను ఊరేగింపు పవిత్ర కృష్ణానదీకి ఊరేగింపుగా తీసుకువెళ్లి పవిత్ర స్నానాలు అనంతరం తిరిగి ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. మధ్యాహ్నం 12గంటలకు స్వామి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించి అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున ప్రసాదాలను పంపిణీ చేశారు. శివాలయం వీధి శ్రీ చక్రకాంప్లెక్స్ వద్ద ది బులియన్ మర్చంట్ అసోసియేషన్ కమిటీ సీనియర్ సభ్యుడు పొట్నూరి దుర్గా ప్రసాద్ దంపతులు స్వామివార్ల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. జనసేన పార్టీ నాయకుడు పోతిన వర ప్రకాష్, బిసి నేతలు పి కార్తీక్, సునీల్, బొట్టావాసుయాదవ్,తదితరులు పాల్గొన్నారు. పాతబస్తీ మేకలవారి వీధిలో ఏర్పాటు చేసిన పందిరిలో వ్యాపారవేత్త కొణిజేటి రమేష్ దంపతులు స్వామివార్ల కల్యాణాన్ని నిర్వహించారు. బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్‌నేత రవి, సోషల్ వర్కర్ డి రాము, ఆర్యవైశ్య నేతలు యం ఆనంద్, గోపాల్, సముద్రాల నాగేశ్వరరావు, సుభానీ,తదితరులు పాల్గొన్నారు. చల్లపల్లి బంగ్లా సెంటర్ శ్రీ దాసాంజనేయస్వామివారి దేవస్థానంలోకొలువైన స్వామివార్లకు ఆలయ ఈవో ఎ సుజన్‌కుమార్ ఆదేశాల మేరకు అర్చకులు ఈప్రత్యేక ఉభయదాతల చేత స్వామివార్ల కల్యాణాన్ని చేయించారు. విచ్చేసిన భక్తులకు పెద్ద ఎత్తున్న స్వామివార్ల ప్రసాదాలను పంపిణీ చేశారు. పాల ప్యాక్టరీ కల్యాణ మండపం ఎదుట ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వ్యాపారవేత్త మాకిన సత్యనారాయణ దంపతులు విచ్చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివార్ల కల్యాణాన్ని నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు స్వామివార్లకు నివేదించి మహాప్రసాదాన్ని భక్తులకు అన్న ప్రసాదంగా పంపిణీ చేశారు. గొల్లపూడి కరకట్ట డౌన్ సెంటర్‌లో ఉన్న శ్రీకృష్ణ చైతన్య మందిరంలో ఉదయం స్వామివార్ల కల్యాణం అత్యంత ఘనంగా జరిగింది. మందిరం సిఇవో దయానిధిదాస్ ఆధ్వర్యంలో ఉదయం 10గంటల నుండి గోపూజ, తులసీ పూజ, తదితర కార్యక్రమాలను నిర్వహించిన తర్వాత సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులకు పెద్ద ఎత్తున్న స్వామివార్ల ప్రసాదాలను పంపిణీ చేశారు. దుర్గగుడి దత్తత ఆలయమైన శ్రీ కోదండ రామస్వామి దేవస్ధానంలోకొలువై ఉన్న స్వామివార్లకు ఆలయ ఈవో వి కోటేశ్వరమ్మ ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్వామివారు, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ప్రత్యేక వాహనంలో ఉంచి నదీవిహారం చేయించారు.

గుణదలమాత క్షేత్రంలో
ఘనంగా మట్టల ఆదివారం
పటమట, ఏప్రిల్ 14: గుణదలమాత పుణ్యక్షేత్రంలో ఆదివారం ఉదయం మట్టల (మ్రానికొమ్మల) ఆదివారం ఘనంగా నిర్వహించారు. పుణ్యక్షేత్రం రెక్టర్ ఫాదర్ యేలేటి విలియం జయరాజు ఆధ్వర్యంలో వందలాది మంది కతోలిక క్రైస్తవుల కొబ్బరి ఆకులు చేతబూని బిషప్ గ్రాసి హైస్కూల్ గ్రౌండ్ నుండి ఊరేగింపుగా పుణ్యక్షేత్రం వరకు దావీదు తనయా హోసన్నా, యూదుల రాజ హోసన్న, ఏసురాజుకు జై జై అంటూ ఆధ్యాత్మిక గీతాలు ఆలాపిస్తూ ముందుకుసాగారు. ఆనాడు ఏసుక్రీస్తు గుడ్‌ఫ్రైడేకి ముందు ఎరూసలేములోకి ప్రవేశించినప్పుడు ఆయనకు అక్కడి ప్రజలు మ్రానికోమ్మల చేతబూని స్వాగతం పలకటం జరిగింది. ఆవిధంగా ఆనాటి నుండి ఈనాటి వరకు క్రైస్తవులు మాన్రికొమ్మల ఆదివారం జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఏసుక్రీస్తు యేరుసలేము ప్రవేశాన్ని పురస్కరించకొని గుణదలమాత పుణ్యక్షేత్రం రెక్టర్ యేలేటి విలియం జయరాజు, సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ పసల తోమస్ తదితర గురువులు ‘సమష్టి దివ్యపూజాబలి సమర్పించారు. దివ్యపూజాబలి అనంతరం గురువులు కతోలిక క్రైస్తవులకు దివ్యసత్ప్రసాదం అందచేశారు. వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలిరావటంతో గుణదలమాత పుణ్యక్షేత్రం ప్రాంగణం భక్తులతో కిటికిటలాడింది.