కృష్ణ

ప్రపంచానికి మార్గదర్శకం ‘అంబేద్కరిజం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: అంబేద్కరిజం ప్రపంచానికి మార్గదర్శకమని జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ పేర్కొన్నారు. డా. బాబా సాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతే కాకుండా ఓ గొప్ప ఆర్థిక శాస్తవ్రేత్త అన్నారు. అంబేద్కర్ 128వ జయంతి మహోత్సవాలను ఆదివారం జిల్లా కేంద్రం మచిలీపట్నంలో అధికారికంగా నిర్వహించారు. జిల్లా సాంఘీక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో కలెక్టర్ ఇంతియాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ గుణగణాలను వివరించారు. తొలుత లక్ష్మీటాకీసు సెంటరులోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కోర్టు సెంటరులోని అంబేద్కర్ భవన్‌లో ఏర్పాటు చేసిన జయంతి మహోత్సవాలను జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ తరతరాలకు అంబేద్కర్ ఆదర్శప్రాయుడన్నారు. న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, సామాజిక శాస్తవ్రేత్తగా, అంత్రోపాలజిస్ట్‌గా మానవ పరినామ క్రమాన్ని పరిశోధన చేసిన అంబేద్కర్ జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకం కావాలన్నారు. బలహీనుడు, బలవంతుడు ఇద్దరికీ సమాన అవకాశాలు కలగడం ప్రజాస్వామ్యం అని అంబేద్కర్ నిర్వచించారన్నారు. జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని అంబేద్కర్ భవన్ నవీకరణకు రూ.3కోట్లు మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. అంబేద్కర్ రచనలు ఎన్నో మనలో స్ఫూర్తిని నింపుతాయన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎ ప్రసాద్ మాట్లాడుతూ సమ సమాజ నిర్మాణానికి కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్ అన్నారు. నూజివీడు సబ్ కలెక్టర్ స్వప్నల్ దినకర్ మాట్లాడుతూ మహాత్మ గాంధి దేశ స్వాతంత్య్రం కోసం పోరాడగా అంబేద్కర్ అట్టడుగు వర్గాల స్వేచ్ఛా స్వాతంత్రం కోసం వారి ఉన్నతి కోసం పోరాడారన్నారు. ఏపీ భవన్ స్పెషల్ ఆఫీసర్ కె జయరావు మాట్లాడుతూ సమీకరించు, బోధించు, పోరాడు అనే అంబేద్కర్ ఆశయాలు అందరికీ అనుసరనీయమన్నారు. సాంఘీక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఇడీ మురళి, ఆర్డీవో జె ఉదయ భాస్కర్, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ సాక్షిగా టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ

*ముగ్గురికి గాయాలు

పెదపారుపూడి, ఏప్రిల్ 14: ఎన్నికల వైరం వేడి చల్లారక ముందే మరలా ఇరువర్గాల మధ్య అగ్గి రాజుకుంది. మండల కేంద్రమైన పెదపారుపూడిలో ఆదివారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ సాక్షిగా ఇరువర్గాలు బాహాబాహీకి దిగడంతో ముగ్గురు గాయపడ్డారు. అంబేద్కర్ విగ్రహానికి టీడీపీ మండల కార్యదర్శి చప్పిడి కిషోర్ పూలమాలలు వేసేందుకు వచ్చారు. అదే సమయంలో వైసీపీ అభ్యర్థి కైలా అనిల్‌కుమార్ కార్యకర్తలతో విగ్రహానికి పూలమాలలు వేసేందుకు వచ్చారు. పూలమాలలు వేసే సమయంలో ఇరువర్గాల మధ్య మాటలు రావడంతో బాహాబాహీకి దిగారు. దీనిలో వైసీపీకి చెందిన చిగురుపాటి శ్రీ్ధర్, చీకటి నరేంద్రలు గాయాల పాలవగా టీడీపీకి చెందిన చప్పిడి కిషోర్‌కి గాయాలయ్యాయి. గాయపడిన వారిని గుడివాడలోని ప్రభుత్వాసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతున్నారు. తమ కార్యకర్తలపై దాడి చేసి గాయపర్చడమే కాకుండా ఉప్పులేటి కల్పన స్టేషన్‌లో కూర్చోపెట్టి తనను రోడ్డుపై నిలిపి వేసిందని, ఇది పోలీసుల తీరుకు నిదర్శనమన్నారు. అధికార పార్టీకి చెందిన వారికి మర్యాదలు చేయడం దారుణమన్నారు. తమ కార్యకర్తలపై అన్యాయంగా దాడి చేయడంతో ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్పీ సందీప్ ఆధ్వర్యంలో పామర్రు, గుడివాడ సీఐలు శివశంకర్, ఎస్‌ఐలు పాల్గొని ఇరువర్గాల ఫిర్యాదు తీసుకుంటారని, విచారణ అంనతరం కేసు నమోదు చేయడం జరుగుతందన్నారు. విషయం తెలుసుకున్న ఉప్పులేటి కల్పన పోలీస్‌ష్టేషన్‌కు వచ్చి తన నాయకుడిపై దాడి చేయడం దురదృష్టకరమన్నారు. దాడికి దిగిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. సీఐ శివశంకర్ మాట్లాడుతూ ఇరువర్గాల ఫిర్యాదులు తీసుకున్నామని, దీనిపై విచారణ చేపట్టామని తెలిపారు.