కృష్ణ

నేటి నుండి ‘పది’ మూల్యాంకనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: నేటి నుండి పదవ తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకనం ప్రారంభం కానుంది. జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని సెయింట్ ఫ్రాన్సిస్ హైస్కూల్‌లో ఈ మూల్యాంకన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు జిల్లా విద్యా శాఖాధికారిణి ఎంవి రాజ్యలక్ష్మి తెలిపారు. ఈ నెల 27వతేదీ వరకు మూల్యాంకన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. మొత్తం 5లక్షల 23వేల 880 సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయనున్నారు. 11 మంది అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్లు, 15 మంది అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్లు అసిస్టెంట్లు, 1143 మంది పరీక్షకులు, 325 మంది స్పెషల్ అసిస్టెంట్లు మూల్యాంకన విధుల్లో పాల్గొననున్నారు. బయోమెట్రిక్ అటెండెన్స్ ద్వారా హాజరు తీసుకోనున్నారు. మూల్యాంకనలో పాల్గొనే పరీక్షకుల కోసం అన్ని వసతులు ఏర్పాటు చేశారు. మంచినీటి వసతితో పాటు మెడికల్ క్యాంప్‌లను కూడా ఏర్పాటు చేశారు. అలాగే మూల్యాంకన కేంద్రం వద్ద ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. క్యాంప్ ఆఫీసర్‌గా జిల్లా విద్యాశాఖాధికారిణి ఎంవి రాజ్యలక్ష్మి వ్యవహరించనున్నారు.