కృష్ణ

నేచురల్ కర్ఫ్యూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు: పెరిగిన ఎండలకు జనం తల్లడిల్లుతున్నారు. రహదారులు కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. మే నెల రాకముందే, రోహిణి కార్తె కూడా ప్రవేశించకుందే ఎండలు హడలెత్తిస్తున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ ఎండతీవ్రత తగ్గటం లేదు. ప్రధాన వీధులు, అంతర్గత రహదారులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. జనజీవనం స్తంభించిపోతున్నది. సాయంత్రం పూర్తిగా వేడి తగ్గితే కాని ఇళ్ళనుంచి జనం బయటకు రావడం లేదు. సగటు కష్టజీవికి మాత్రం ఎండైనా, వానైనా ఒక్కటే కాబట్టి కార్మికులు ఎంత ఎండైనా చెమటోడ్చక తప్పటం లేదు. రెక్కాడితే డొక్కాడని కటిక పేదలు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎండను సైతం లెక్కచేయకుండా ఉదయానే్న పనులకు వెళ్ళిపోతున్నారు. ఎండలో తిరగటం వల్ల అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని, తప్పని సరి అయితే పలుచటి తెల్లవస్త్రాలు, టోపీలు ధరించి బయటకు రావాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే ఉష్ణోగ్రతలు పెరగటంతో శీతల పానీయాలకు, పండ్ల రసాలకు గిరాకీ బాగా పెరిగింది. ఇప్పటికే చలువ చేసే వస్తువుల ధరలు చుక్కలనంటుతున్నాయి. మున్ముందు వీటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

వైభవంగా లంకమ్మ తల్లి జాతర

అవనిగడ్డ, ఏప్రిల్ 18: దివిసీమ భక్తుల కొంగుబంగారంలా ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న శ్రీ లంకమ్మ అమ్మవారి జాతర మహోత్సవం గురువారం వైభవంగా ప్రారంభమైంది. తెల్లవారు జాము నుండే పలు ప్రాంతాల నుండి భక్తులు ఆలయానికి తరలి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వైకాపా నియోజకవర్గ కన్వీనర్ సింహాద్రి రమేష్‌బాబు, జనసేన పార్టీ నేత ముత్తంశెట్టి కృష్ణారావు, రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ తనయుడు మండలి రాజా తదితరులు అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సింహాద్రి రమేష్‌బాబు పార్టీ కార్యాలయం వద్ద భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. అలాగే మండలి రాజా పానకం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ యాసం శ్రీరాములు, ఆలయ ఇఓ టివివి మోహనరావుతో పాటు పలువురు ప్రముఖులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విచిత్ర వేషదారణలు, డప్పుల నృత్యాలతో ఆలయానికి భక్తులు చేరుకున్నారు. అలాగే మహిళ భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారికి చద్ది నైవేద్యాలు సమర్పించారు. అలాగే ఘటం బిందెలతో కూడా ఊరేగుతూ పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా దాదాపు 10వేల మందికి అన్నసమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయగా డీఎస్పీ పోతురాజు ప్రారంభించారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకోవటంతో ఆలయం భక్తులతో పోటెత్తింది. అలాగే ఆటో యజమానులు, లారీ యజమానుల సంఘం ఆధ్వర్యంలో వారివారి వాహనాలను అలంకరించి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. డీఎస్పీ పోతురాజు ఆధ్వర్యంలో శాంతి భద్రతలు పర్యవేక్షించగా సీఐ శ్రీ్ధర్, ఎస్‌ఐ సందీప్ ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. ఈ సందర్భంగానే సంతానం లేని వారు అమ్మవారి ఆలయం వద్ద పానాచారం చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు.