కృష్ణ

మే రెండో వారంలో ‘పది’ ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: మే నెల రెండవ వారంలో పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని విద్యా శాఖ కమిషనర్ ఎం సంధ్యారాణి తెలిపారు. గురువారం ఆమె స్థానిక సెయింట్ ఫ్రాన్సిస్ హైస్కూలులో జరుగుతున్న పదవ తరగతి సమాధాన పత్రాల మూల్యాంకనంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 27వతేదీ నాటికి మూల్యాంకనం ప్రక్రియ పూర్తి కానుందన్నారు. కృష్ణాజిల్లాలో జరుగుతున్న మూల్యాంకనంలో విద్యా శాఖాధికారులు ప్రదర్శిస్తున్న పనితీరు భేషుగ్గా ఉందని ఆమె కితాబిచ్చారు. గత నాలుగు రోజుల్లోగా లక్షా 45వేల 708 సమాధాన పత్రాల మూల్యాంకనం పూర్తయిందని జిల్లా విద్యా శాఖాధికారిణి ఎంవి రాజ్యలక్ష్మి కమిషనర్‌కు వివరించారు. మొత్తం 151 మంది చీఫ్ ఎగ్జామినర్లు 897 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 301 మంది స్పెషల్ అసిస్టెంట్లు మూల్యాంకన విధుల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ఆమె వెంట బందరు, గుడివాడ డీవైఇఓలు బి సత్యనారాయణమూర్తి, కమల కుమారి, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ అమరలింగేశ్వరరావు, ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి వెంకటేశ్వరరావు, పవన్ కుమార్ తదితరులు ఉన్నారు.