కృష్ణ

పరిగణనలోకి ప్రాధాన్యత అంశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: వేసవి దృష్ట్యా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కీలక సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ అధికారులకు సూచించారు. చైర్‌పర్సన్ అనూరాధ అధ్యక్షతన గురువారం జెడ్పీ సమావేశ మందిరంలో జెడ్పీ స్థారుూ సంఘ సమావేశాలు జరిగాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను గుర్తించి స్థారుూ సంఘ సమావేశాలను నిర్వహించడం జరిగిందని ఆమె తెలిపారు. ఎటువంటి అజెండా లేకుండా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మాత్రమే స్థారుూ సంఘ సమావేశంలో చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ వేసవి దృష్ట్యా శివారు ప్రాంత గ్రామాల్లో తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా ఆర్‌డబ్ల్యుయస్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి శివారు గ్రామానికి తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మంచినీటి సమస్యపై జరిగిన చర్చలో ఆర్‌డబ్ల్యుయస్ ఎస్‌ఇ శివనాధ్ మాట్లాడుతూ వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు యాక్షన్ ప్లాన్ తయారు చేశామన్నారు. ఇప్పటికే డెల్టా ప్రాంతాలకు కెనాల్ ద్వారా నీటిని విడుదల చేసి మంచినీటి చెరువులను పూర్తి స్థాయిలో నింపినట్లు తెలిపారు. మే 15వ తేదీ వరకు ఈ నీటి నిల్వలు సరిపోతాయన్నారు. అప్పటికి కెనాల్ నుండి నీరు రాని పక్షంలో ప్రత్యేకంగా బోర్లు వేసి నీటి సరఫరాకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ పనులపై జరిగిన చర్చలో జెడ్పీ చైర్‌పర్సన్ అనూరాధ మాట్లాడుతూ వేసవి దృష్ట్యా ఉపాధి హామీ పనులు చేసే కూలీల సంఖ్య మరింత పెంచాలన్నారు. అలాగే వారికి వేసవి నుండి సంరక్షణ చర్యలు కూడా చేపట్టాలన్నారు. ఉపాధి పనులు జరిగే ప్రాంతాల్లో కూలీలు విశ్రాంతి తీసుకునేందుకు షెడ్లు ఏర్పాటు చేయటంతో పాటు మజ్జిగ పంపిణీ చేయాలన్నారు. మెడికల్ కిట్‌లను అందుబాటులో ఉంచాలన్నారు. వడదెబ్బ నివారణపై వైద్య ఆరోగ్య శాఖాధికారులు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలలకు శెలవు ఇవ్వటంతో అవసరమైన మరమ్మతు పనులు గుర్తించి పాఠశాలల పునః ప్రారంభం నాటికి పూర్తి చేయాలన్నారు. అలాగే విద్యార్థులకు ఉచితంగా అందించే ఏక రూప దుస్తుల కొలతల్లో తేడాలు లేకుండా చూడాలన్నారు. గృహ నిర్మాణానికి సంబంధించిన బిల్లుల పెండింగ్‌ను క్లియర్ చేయాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఇఓ షేక్ సలాం, పలువురు జెడ్పీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.