కృష్ణ

ఆక్వా రైతుల దరఖాస్తులను పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లబ్బీపేట: చేపల చెరువుల రిజిస్ట్రేషన్ల కోసం ఆక్వా రైతులు సమర్పించిన దరఖాస్తులను మండల స్థాయి కమిటీ త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం జిల్లా స్థాయి విస్తృత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చేపల చెరువుల రిజిస్ట్రేషన్ల కోసం ఆక్వా రైతుల దరఖాస్తులను మండల స్థాయి కమిటీ సభ్యులు త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ముఖ్యంగా కలిదిండి, కైకలూరు, మండవల్లి, కృతివెన్ను, మచిలీపట్నం, మండలాల్లో పరిష్కరించాల్సిన వివిధ రకాల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. చేపల చెరువుల క్రమబద్ధీకరణకు జూన్ 30లోగా రైతులు దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిష్కరించాలన్నారు. ఆక్వా, వ్యవసాయ రైతులకు వచ్చే సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వ నిబంధనల మేరకు అధికారులు చెరువుల రిజిస్ట్రేషన్ దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. కమిటీ సమావేశంలో మంచినీటి, ఉప్పునీటి చెరువుల రిజిస్ట్రేషన్ కోసం మండలాల్లో ఉన్న దరఖాస్తులను సమీక్షించటంతో పాటు వ్యవసాయ ఆక్వా చెరువులు నిర్వహించే రైతులకు సంబంధించిన కేసులపై సమీక్షించారు. కమిటీ సమావేశంలో జెసీ 2 బాబురావు, మత్స్య శాఖ జెడి యాకూబ్ బాషా, డిప్యూటీ డైరక్టర్ రాఘవరెడ్డి, కమిటీ సభ్యులు గొరివర్తి నరసింహరాజు, కమటీ సభ్యులు, ఆక్వా రైతు కె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.