కృష్ణ

‘సన్’ స్ట్రోక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటరు) : భగ భగ మండుతున్న సూరీడుతో ప్రజలు కకావికలవుతున్నారు. వేసవి తాపం నుండి ఉపశమనానికి ఎండలకు సేద తీరేందుకు ప్రజలు అనేక మార్గాలు అనే్వషించుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. వేకువ జాము నుండే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నారు. రాత్రి 8గంటలు దాటే వరకు వడగాలుల ప్రభావం తగ్గడం లేదు. దీంతో చిన్న పిల్లలు, వృద్ధులు, వయోవృద్ధులు అనేక అవస్థలకు గురవుతున్నారు. ఉదయం 10గంటల నుండే ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. సాయంత్రం 6గంటల వరకు జన సంచారం లేక రోడ్లన్నీ బోసిగా కనిపిస్తున్నాయి. ఎండల ప్రభావంతో వర్తక, వాణిజ్య కేంద్రాలకు వినియోగదారుల సంఖ్య కూడా గణనీయంగా పడిపోతోంది. జన సంచారం లేక... వ్యాపారాలు మందగించడంతో దుకాణదారులు కూడా కొట్లకు తాళాలు వేసి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. శీతల పానీయాలకు గిరాకీ పెరిగింది. పుట్టగొడుగుల్లా శీతల పానీయ కేంద్రాలు పట్టణంలో వెలిశాయి. సాయం సంధ్యా సమయంలో శీతల పానీయ కేంద్రాలు ప్రజలతో కళకళలాడుతున్నాయి.