కృష్ణ

తొలి రోజు ఎంసెట్ ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ఎంసెట్ ప్రవేశ పరీక్షలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. శనివారం ప్రారంభమైన పరీక్షలు ఈ నెల 24వతేదీ వరకు జరగనున్నాయి. పరీక్షలకు నిర్వహణకు గాను జిల్లాలో మొత్తం 11 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 23వ తేదీ వరకు ఇంజనీరింగ్ విభాగంలో, 23, 24తేదీల్లో అగ్రికల్చరల్, మెడిసిన్ కోర్సు విభాగాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. గత రెండు సంవత్సరాలుగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తొలి రోజైన శనివారం ఉదయం నిర్వహించిన పరీక్షకు 4వేల 173 మంది విద్యార్థులు హాజరు కావల్సి ఉండగా 3వేల 973 మంది హాజరయ్యారు. హాజరు శాతం 95.21గా నమోదైంది. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 4వేల 155 మంది విద్యార్థులకు గాను 3వేల 974 మంది విద్యార్థులు హాజరయ్యారు. హాజరు శాతం 95.64గా నమోదైంది. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం మంచినీటి వసతి కల్పించారు. అలాగే ప్రాథమిక చికిత్సా శిబిరాలు ఏర్పాటు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని అధికారులు చేసిన హెచ్చరికలతో విద్యార్థులు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది.