కృష్ణ

క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని, అటువంటి వారిపై ఉక్కుపాదం మోపుతామని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి హెచ్చరించారు. మంగళవారం ఆయన క్రికెట్ బెట్టింగ్‌లపై జిల్లాలోని స్టేషన్ అధికారులతో సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఎక్కడా కూడా క్రికెట్ బెట్టింగ్‌లు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బెట్టింగ్ స్థావరాలపై విస్తృతంగా దాడులు నిర్వహించాలన్నారు. బెట్టింగ్‌లకు పాల్పడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దన్నారు. వెంటనే కేసులు నమోదు చేసి బెట్టింగ్ రాయుళ్లను అదుపులోకి తీసుకోవాలన్నారు. జిల్లాతో పాటు ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగ్ స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఇక్కడ లావాదేవీలు నిర్వహిస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అటువంటి వారి జాబితా తయారు చేసి ముందస్తుగా వారిపై బైండోవర్ కేసులు నమోదు చేయాలన్నారు. అత్యాసకు పోయి జీవితాలు నాశనం చేసుకోవద్దని యువతకు తెలియచేయాలన్నారు. బెట్టింగ్‌ల వల్ల కలిగే ఇబ్బందులను తెలియచేయాలన్నారు. బెట్టింగ్ స్థావరాలు, బెట్టింగ్‌లకు పాల్పడే వారి వివరాలను నేరుగా డయల్ 100కు తెలియచేయవచ్చన్నారు. సమాచారం ఇచ్చే వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు.