కృష్ణ

ఆర్టీసీ ఉద్యోగులకు బీమా పరిహారం చెల్లింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పని చేస్తూ సహజ మరణం పొందిన ఉద్యోగులకు బీమా పరిహారం చెల్లింపులు చేశారు. ఆర్టీసీలో పని చేస్తూ జనవరి, ఫిబ్రవరి నెలలో సహజ మరణం పొందిన 11 మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికీ ఐదు లక్షల చొప్పున బీమా పరిహారాన్ని అందజేశారు. ఆర్టీసీ క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ ద్వారా ఆర్టీసీ ఉద్యోగులకు, కార్మికులకు వర్తింప చేస్తున్న కుటుంబ నేస్తం పథకం ద్వారా ఈ బీమా మొత్తాన్ని చెల్లించారు. రేపల్లె డిపోలో పని చేస్తున్న డ్రైవర్ ఎస్‌ఎస్‌ఎస్ రావు, వినుకొండ డిపోలో కండక్టర్ జె జోజి బాబు, ఎమ్మిగనూరు డిపోలోని డ్రైవర్ ఎంవిజి రావు, శ్రీకాళహస్తి డిపోలోని డ్రైవర్ కె రంగస్వామి, ఏలూరు డిపోలోని టీటీఐ ఆర్‌బి రావు, కదిరి డిపోలోని కండక్టర్ ఎస్‌కె హుస్సేన్, విజయవాడ ఆటోనగర్ డిపోలో డిప్యూటీ సొపరింటెండెంట్‌గా పని చేస్తున్న బివి రావు, జంగారెడ్డిగూడెం డిపోలోని ఏడీసీగా పని చేస్తున్న పి శ్రీనివాసరావు, ఇబ్రహీంపట్నం డిపోలో హెల్పర్‌గా పని చేస్తున్న వి ప్రసాద్, కళ్యాణదుర్గం డిపోకు చెందిన మెకానిక్ బి మునియ్యలకు ఐదు లక్షల రూపాయల వంతుల చెక్కులను సీసీఎస్ కార్యదర్శి టీ త్రాసు అందించారు. వీరితో పాటు మార్చి నెలలో సహజ మరణం పొందిన మరో 11 మంది సంఘ సభ్యుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు, ఇందుకు సంబంధించి చర్యలు చెపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. ఏపీఎస్‌ఆర్టీసీ కుటుంబం నేస్తం పథకం ద్వారా రూ. 5 లక్షల మొత్తం అందుకున్న ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబ సభ్యులు, ఆర్టీసీ యాజమాన్యానికి, సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.