కృష్ణ

ఎపిలో తిరగాలంటే వీసా కావాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట రూరల్, మే 30: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరగాలంటే వీసా కావాలా ఇదేమన్నా పాకిస్తానా, పరాయి దేశమా అని ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణమాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు బయలుదేరిన ఆయనను ఇబ్రహీంపట్నం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని జిల్లా సరిహద్దు గరికపాడు వరకూ పోలీస్ వాహనంలో తీసుకువచ్చి సరిహద్దు దాటించారు. ఈ సందర్భంగా కృష్ణ మాదిగ విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. తిరుపతిలో నిర్వహించిన మహానాడులో 28 తీర్మానాలు చేసిన తెలుగుదేశం చిరకాల హామీ అయిన ఎస్‌సి వర్గీకరణను విస్మరించిందని, ఈ అంశంతో పాటు రాజ్యసభలో ఎస్‌సిలకు ఒక సీటు కేటాయించాలని అడిగేందుకు విజయవాడ బయలుదేరిన తనను పోలీసులు ప్రజాస్వామ్య విరుద్ధంగా అదుపులోకి తీసుకున్నారని ఆక్షేపించారు. అధికారంలోకి రాకముందు పాదయాత్ర సమయంలో తెలంగాణలో టిఆర్‌ఎస్ శ్రేణులు చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం చేయగా మాదిగలు అండగా నిలిచారని, ఆంధ్రలో మాదిగలు ఓటు వేసి తెలుగుదేశం పార్టీని ఆధికారంలోకి తెచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఎస్‌సి వర్గీకరణను పూర్తిగా విస్మరించి మాల నాయకులైన జూపూడి ప్రభాకరరావు, కారంపూడి శివాజీకి ఎస్‌సి, ఎస్‌టి చైర్మన్ పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. తమకు ఇచ్చిన హామీ మేరకు ఎస్‌సి వర్గీకరణ ఇంతవరకూ చేయలేని సిఎం మహానాడులో ప్రవేశపెట్టిన 28 తీర్మానాలు ఎలా అమలు చేయగలరని ప్రశ్నించారు. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని అడ్డంకులు కల్పించినా ఎస్‌సి వర్గీకరణ జరిగే వరకూ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఆయనతో పాటు జిల్లా ఎంఆర్‌పిఎస్ అధ్యక్షుడు కోట డానియేల్ మాదిగ, అనె్నపాక కాంతారావు పాల్గొన్నారు.