కృష్ణ

హేపీ బర్త్‌డే టూ యూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: ఇప్పటి వరకూ మనుషుల జన్మదిన వేడుకలనే మనం చూశాం... ఒక పశు ప్రేమికుడు తాను అల్లారుముద్దుగా పెంచుకున్న పశువులకు కూడా బర్త్‌డే వేడుకలను నిర్వహించి పశు సంతతిపై తనకున్న మమకారాన్ని, ప్రేమను చాటుకున్నాడు. వివరాలలోకి వెళితే మైలవరం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్, ఆదర్శ రైతు ధనేకుల సాంబశివరావు (బుల్లిబాబు) ఆది నుండి పశు ప్రేమికుడు. స్వతహాగా వ్యవసాయదారుడు కూడా. తనకు గల మామిడి తోటలో పశువుల పెంపకం పైనే అధిక దృష్టి, ధ్యాస పెడతాడు. ఇందులో భాగంగా ఒంగోలు జాతి పశు సంపదను పెంపొందించాలన్న తపనతో ఏడాది క్రితం ఒంగోలు జాతికి చెందిన మూడు ఆవులను కొనుగోలు చేసి పోషిస్తున్నాడు. అందులో ఒక ఆవు ఒక గిత్తదూడకు జన్మనిచ్చింది. దానికి ‘బలరామ్’ అనే నామకరణం చేశారు. అదేవిధంగా మూడు మాసాల వ్యవధిలో మరో ఆవు కూడా గిత్తదూడకు జన్మనివ్వటంతో దానికి ‘శ్రీరామ్’ అని, మరో మూడు మాసాల వ్యవధిలో మరో ఆవు గిత్తదూడకు జన్మనివ్వటంతో దానికి ‘పరశురామ్’ అని నామకరణం చేశాడు. అప్పటి నుండి వాటిని అల్లారుముద్దుగా ‘కొడుకుల్లా’ పెంచి పోషిస్తున్నాడు. అవి ఎక్కడ ఉన్నా సదరు యజమాని దేని పేరు పెట్టి పిలిస్తే అదే వస్తుంది. ఆ యజమానిని చూడగానే మనుషులలో తాము ఒకరమనే భావన కలిగిస్తాయి. ఇందులో భాగంగా ‘బలరామ్’ జన్మించి ఏడాది అయిన సందర్భంగా బుధవారం దానికి మొదటి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మామిడి తోటలో ఐదు కిలోల కేకును తెచ్చి బలరామ్ సమక్షంలో రైతు బుల్లిబాబు కేకుకట్ చేసి బలరామ్‌కు తినిపించి అభిమానులకు పంపిణీ చేశారు. అనంతరం భోజనాలు పెట్టి సెలబ్రేషన్స్ చేశాడు.

మమకారమే వేడుకలు చేయంచింది
అంతరించి పోతున్న పశుసంపదను పెంపొందించటానికే తాను ఒంగోలు జాతి పశువులను పోషిస్తున్నానని బుల్లిబాబు ఈ సందర్భంగా వెల్లడించారు. పశువులూ జీవులేనని, మనిషి నడిచిన భూమి బీడవుతుందని, అదే పశువు నడయాడిని భూమి బంగారం అవుతుందని స్పష్టం చేశారు. తనకు పశు పోషణ అంటే ఎంతో మక్కువ అని అందుకే వీటికి పేర్లు పెట్టి పశు పోషణలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టానన్నారు. ప్రేమతో పెంచుకుంటున్న బలరామ్, శ్రీరామ్, పరుశురామ్ తనను ఒక్కరోజు కూడా చూడకుండా ఉండలేవని, ప్రతిరోజూ తాను కూడా వాటి పోషణ, లాలన తానే స్వయంగా చూస్తానని పేర్కొన్నారు. అల్లారుముద్దుగా పెంచుకునే కొడుకులు, కూతుర్లు పిలవగానే వస్తారో లేదో తెలియదు గానీ, ఇవి మాత్రం దేన్ని పిలిస్తే అది ‘నేనిక్కడే’ అంటూ ఆఘమేఘాల మీద ఉరికొస్తుందని వివరించారు. వీటికి మనతో పంచుకోడానికి ‘నోరు’ లేకపోయనా ‘మమకారానికి’ మారుపేరుగా మసులుకుంటాయని గర్వంగా చెప్పారు. మరో మూడు నెలల్లో శ్రీరామ్, పరుశురామ్ జన్మదిన వేడుకలను కూడా ఘనంగా చేస్తానని చెపుకొచ్చారు. తన ఇంటి చావడిలో 40 నుండి 50 పశువులను పోషిస్తుంటానని వాటికి మనుషులకు మాదిరిగానే నివాస యోగ్యమైన వసతులతోపాటు ‘్ఫరెక్స్, సిరిలాక్’ మాదిరి బలవర్థకమైన అరటిపళ్లు, బెల్లం, తెలగపిండి ఆప్యాయతతో తినిపిస్తానని చెప్పారు.