కృష్ణ

లక్ష్యానికి దూరంగా కొనుగోలు కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: అదును దాటిన తర్వాత ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులకు ఏ మాత్రం అక్కరకు రావడం లేదు. అదును దాటినా కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరిస్తున్న ధాన్యంకు చెల్లింపులు అంతంత మాత్రంగానే ఉండటం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల హడావిడి అంతా అయిపోయిన తర్వాత జిల్లా అధికార యంత్రాంగం రబీ ధాన్యం కొనుగోలుతోపాటు ఖరీఫ్‌లో కుప్పల మీద ఉన్న ధాన్యం కొనుగోళ్లకు గాను జిల్లాలో 180 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు (పీఎసీఎస్)ల ద్వారా 139, వెలుగు ద్వారా 19, సివిల్ సప్లయిస్ కో-ఆపరేషన్ ద్వారా 10, డీసీఎంఎస్ ద్వారా మరో 12 కేంద్రాలు మొత్తం 180 కేంద్రాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేంద్రాల ద్వారా జిల్లాలో రబీకి సంబంధించి రెండు లక్షల మెట్రిక్ టన్నులు, ఖరీఫ్‌లో కుప్పల మీద ఉన్న దిగుబడికి సంబంధించి మరో రెండున్నర లక్షల మెట్రిక్ టన్నులు మొత్తం 4.5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఇప్పటి వరకు కేవలం 74వేల టన్నులు మాత్రమే రైతుల నుండి సేకరించారు. ఇందుకు గాను రూ.132కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉండగా రూ.82 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇంకా రూ.50కోట్ల మేర రైతులకు జమ చేయాల్సి ఉంది. చాలా మంది రైతులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక ముందే ధాన్యాన్ని దళారులకు అమ్ముకున్నారు. 180 కొనుగోలు కేంద్రాల్లో కేవలం 132 కేంద్రాల్లో మాత్రమే కొనుగోళ్ల ప్రక్రియ జరుగుతోంది. మిగిలిన కేంద్రాల్లో ఎటువంటి కొనుగోళ్లు జరగలేదు. వీటి కోసం రైతులు కాళ్లు అరిగేలా కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. అమ్మిన కొద్దిపాటి ధాన్యానికే చెల్లింపులు జరగకపోవటం పట్ల రైతులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా కొనుగోళ్ల ప్రక్రియ కూడా అంతంత మాత్రంగానే సాగుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల సంచుల బెడద పట్టిపీడిస్తోంది. ముఖ్యంగా కొత్త సంచుల కొరత రైతులను పట్టి పీడిస్తోందని అధికార వర్గాలే చెబుతుండటం విశేషం. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా రైతుల్లో కొంత మేర అలజడి మొదలవుతోంది. మార్కెటింగ్ శాఖ టార్ఫాలిన్‌ల పంపిణీ జరగడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాతావరణం మార్పుల కారణంగా పశ్చిమ కృష్ణాలో ఈదురు గాలులతో పాటు కొద్దిపాటి వర్షాలు పడుతున్నాయి. టార్పాలిన్‌లు లేని కారణంగా దిగుబడులు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా మార్కెటింగ్ శాఖాధికారులు స్పందించి రైతులకు టార్పాలిన్‌లు పంపిణీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.