కృష్ణ

ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్): ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వం బడ్జెట్‌లో ఐదు శాతం నిధులు కేటాయించాలని ఆలిండియా మెడికల్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ పొట్లూరి గంగాధరరావు అన్నారు. స్థానిక పరాసుపేట త్రిపుర సుందరి ఫౌండేషన్ ఇండియా కార్యాలయంలో గురువారం సంస్థ 23వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ పొట్లూరి గంగాధరరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 494 వైద్య కళాశాలల్లో 60వేల మంది వైద్యులు బయటకు వస్తుండగా వారిలో 40వేల మంది నిరుద్యోగులుగా ఉంటున్నారన్నారు. క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించి సమర్ధులైన వైద్యుల సేవలను వినియోగించుకోవాలన్నారు. త్రిపుర సుందరి ఫౌండేషన్ 23 సంవత్సరాలుగా ఉచిత మధుమేహ చికిత్సా కేంద్రం నిర్వహించడం ముదావహమన్నారు. లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ తదితర స్వచ్ఛంద సంస్థలు ఇటువంటి ఉచిత చికిత్సా కేంద్రాలు నిర్వహించి ప్రజారోగ్యానికి పాటుపడాలన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరపున ప్రజారోగ్య పరిరక్షణకు నిరంతర కృషి చేస్తున్నామన్నారు. విజయవాడ ఐఎన్‌ఎన్‌ఓవిఐ కిడ్నీ క్లీనిక్ నెప్రాలజిస్టు వి విష్ణుప్రియ మధుమేహం వలన వచ్చే మూత్ర పిండాలు సంబంధించిన వ్యాధులు, నివారణపై, విజయవాడ గ్యాస్ట్రో హాస్పిటల్‌కు చెందిన గ్యాస్ట్రో ఎన్‌ట్రాలజిస్ట్ వి కృష్ణప్రియ మధుమేహం వలన పొట్టకు సంబంధించిన వ్యాధులు, నివారణ గురించి తెలిపారు. అనంతరం డా. అశ్వని కుమార్ రచించిన మధుమేహం పట్ల తెలిసి తెలిసి ఎందుకీ పొరపాట్లు అనే చిన్న పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా డా. గంగాధరరావు, డా. విష్ణుప్రియ, డా. కృష్ణప్రియ, డా. అశ్వని కుమార్, డా. సుధామయి, డా. ఎం సౌభాగ్యవతి, డా. ఎస్ మల్లికాంబ, డా. శివప్రసాద్‌లను ఘనంగా సత్కరించారు. సంస్థ కార్యదర్శి వింజమూరి శివరాం వార్షిక నివేదికను సమర్పించారు.

కూచిపూడి నాట్య ఎంపీఎ ప్రాయోజక పరీక్షలు
కూచిపూడి, ఏప్రిల్ 25: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం, స్థానిక శ్రీ సిద్ధేంద్రయోగి కూచిపూడి కళాపీఠంలో గురువారం నిర్వహించిన ఎంపీఎ ప్రాయోజక పరీక్షలకు రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు నుండి విద్యార్థులు తరలి వచ్చారు. కూచిపూడి నాట్యం ఎంపీఎ మొదటి సంవత్సరం 2వ సెమిస్టర్, 2వ సంవత్సరం 4వ సెమిస్టర్ పరీక్షలకు బెంగుళూరు, మహబుబాబాద్, రాజమండ్రి, రావులపాలెం, విజయవాడ తదితర ప్రాంతాల నుండి విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. కళాపీఠం ప్రిన్సిపాల్ డా. వేదాంతం రామలింగశాస్ర్తీ పర్యవేక్షణలో వేదాంతం పార్ధసారథి శర్మ, వేదాంతం పాండురంగశర్మ ఇన్విజిలేటర్లుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రాయోజక పరీక్షలకు వేదాంతం వెంకట దుర్గ్భావానీ గాత్ర సహకారాన్ని, ఏలేశ్వరపు శ్రీనివాస్ నట్టవాంగాన్ని, పసుమర్తి హరనాథశాస్ర్తీ మృదంగ సహకారాన్ని అంద చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు కూచిపూడి నాట్యాడ్యుడు శ్రీ సిద్దేంద్రయోగి మూర్తి ఎదుట తమ కళా ప్రాభవాన్ని ప్రదర్శించారు.