కృష్ణ

అంగన్‌వాడీలకు మే నెలంతా సెలవులివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: అంగన్‌వాడీలకు కూడా మేనెల అంతా వేసవి సెలవులివ్వాలని సీఐటీయు మండల అధ్యక్ష, కార్యదర్శులు జె అనిల్ కుమార్, సీహెచ్ సుధాకర్ డిమాండ్ చేశారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్‌కు 40 రోజుల పాటు వేసవి సెలవులిస్తుంటే అంగన్‌వాడీలకు ఇవ్వకపోవటం శోచనీయమన్నారు. మేనెల రాకుండానే ఎండలు మండిపోతున్నాయని, అనేక మంది వడగాడ్పులు, వడదెబ్బకు అనారోగ్యం పాలవుతున్నారని ఇటువంటి పరిస్థితులలో ప్రజలు బయటికి రావటానికి భయపడిపోతున్నారని గుర్తు చేశారు. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ చెబుతున్నా అంగన్‌వాడీలకు ఆ జాగ్రత్తలను వర్తింపచేయటం లేదన్నారు. అంగన్‌వాడీలు 11 గంటల వరకూ స్కూల్స్ నడపాలని, టీచర్లను, ఆయాలను అధికారులు వేధించటమే గాక ప్రతిరోజూ స్కూల్ నడుపుతున్నట్లు వాట్సాప్‌లో ఫోటోలు పెట్టాలని నిర్భంధంగా ఆదేశాలు జారీ చేయటాన్ని ఖండించారు. ఎండ తీవ్రత దృష్ట్యా తల్లిదండ్రులు తమ పిల్లలను కేంద్రాలకు పంపటం లేదని, టీచర్లే ఆ పిల్లలను బతిమాలి తెచ్చుకున్నా వారు ఎండ వేడికి సొమ్మసిల్లి పోతున్నారన్నారు. గర్భిణి, బాలింతలు సైతం కేంద్రాలకు రావటానికి సుముఖత చూపటం లేదన్నారు. లబ్ధిదారులతోపాటు అంగన్‌వాడీలు సైతం అనారోగ్యం పాలవుతున్నారన్నారు. గర్భిణి, బాలింతలకు ఫుడ్ పంపిణీ కోసం గతంలో మాదిరిగా మే నెల వరకూ టేక్‌హోం రేషన్ పద్ధతి అమలు చేయాలని కోరారు. సాధారణ స్కూల్స్, కళాశాలలకు సెలవులిచ్చిన ప్రభుత్వం పసిపిల్లలుండే అంగన్‌వాడీలకు ఇవ్వక పోవటం ప్రభుత్వ అనాలోచిత చర్యగా అభివర్ణించారు. జిల్లా కలెక్టర్ స్పందించాలని డిమాండ్ చేశారు. మే మాసం ఆసాంతం సెలువులివ్వాలని కోరారు.

ప్రపంచ కార్మికవర్గ దీక్షాదినం మేడే

మైలవరం, ఏప్రిల్ 25: ప్రపంచ కార్మికవర్గ దీక్షాదినం మేడే అని సీఐటియు జిల్లా కోశాధికారి ఎం శ్రీనివాస్ అన్నారు. గురువారం స్థానిక కార్యాలయంలో సీఐటియు మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే అంటే ప్రపంచ కార్మికవర్గ దీక్షా దినం అని అన్నారు. నేడు ప్రపంచంలో శ్రమ ఒకరిదైతే సౌఖ్యం మరొకరిదైందన్నారు. పెట్టుబడిదారి వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సంపదను ఎవరైనా సృష్టిస్తారో ఫలితం వారికే చెందే సమాజం రావాలన్నారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న మతోన్మాదాన్ని కుల రక్కసిని కూకటి వేళ్ళతో పెకలించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో, దేశంలోనే కాక ప్రపంచంలోని కార్మిక శ్రమజీవులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో, దేశంలో ఏ పార్టీ అధకారంలోకి వచ్చినా కార్మికుల బతుకు కోసం భవిత కోసం, సంక్షేమం కోసం, సామాజిక హక్కుల కోసం పోరాటం చేయాలన్నారు. మేడే సందర్భంగా ఊరూ వాడా పతాకావిష్కరణ జరపాలని ఎర్రజెండా రెపరెపలతో పెట్టుబడిదారుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తించాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న రోజుల్లో సమాన పనికి సమాన వేతనం, ఐకెఏఐ కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలని, సీపీఎస్, రద్దు, కార్మికుల రక్షణ, రెగ్యులరైజేషన్, అసంఘటిత రంగ కార్మికులకు పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు, అందరికీ పెన్షన్ పథకం, కార్మికుల సంక్షేమ బోర్డు రక్షణ, ఆటోమోటివ్, ట్రాన్స్‌పోర్ట్, హమాలీ, హాకర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు సామాజిక బాధ్యత తదితర కార్మికుల కోరికల పరిష్కారానికై ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మేడే సందర్భంగా ప్రతి ఒక్క కార్మికుడు హక్కుల పరిరక్షణ కోసం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష, కార్యదర్శులు జె అనిల్ కుమార్, సీహెచ్ సుధాకర్, ఆటో భవన నిర్మాణ, పంచాయితీ, అంగన్‌వాడీ, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ రంగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.