కృష్ణ

మంచినీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటరు) : భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆధ్వర్యంలో జిల్లాలో ఏర్పడిన మంచినీటి ఎద్దడి, ఆకాల వర్షాలకు ఏర్పడిన పంట నష్టంపై యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం కలెక్టర్ ఎఎండీ ఇంతియాజ్‌కు నాయకులు వినతిపత్రం అందచేశారు. జిల్లాలోని అన్ని మండలాలు, పట్టణాలలో మంచినీటి తీవ్రత ఉన్నదని, ప్రధానంగా తీరప్రాంత గ్రామాలైన కృత్తివెన్ను మండలం లక్ష్మీపురం, పడతడిక, మాట్లం, గర్శిపూడి, బందరు మండలం పెదపట్నం, కానూరు, కరగ్రహారం, పోలాటితిప్ప, పల్లెతుమ్మలపాలెం, కోన, కమ్మవారిచెరువు, వీవర్స్ కాలనీలో మంచినీటి కోసం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. అలాగే పెడన, మచిలీపట్నం, చల్లపల్లి, పామర్రు, గుడివాడ, గన్నవరం ప్రాంతాలలో, తిరువూరు, నూజివీడు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట తదితర ప్రాంతాలలో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు పనిచేయటం లేదని పేర్కొన్నారు. తీర ప్రాంత గ్రామాలలో చేపలు, రొయ్యల చెరువుల వలన నీరు కలుషితమై ఉప్పునీటిగా మారిపోయిందని, దీంతో పశువులకు తాగటానికి కూడా గుక్కెడు నీరు లేక అల్లాడుతున్నాయని వాపోయారు. ఇప్పటికైనా స్పందించి తక్షణమే యుద్ధప్రాతిపదికన మంచినీరు సరఫరా చేయాలని కోరారు.

తమ్మనవారి సత్రాన్ని పరిరక్షించాలి
మచిలీపట్నం (కల్చరల్), ఏప్రిల్ 25: పేద, మధ్య తరగతి ప్రజలకు ఉపయోగకరంగా ఉన్న తమ్మన పిచ్చియార్యుని ధర్మ సత్రాన్ని దేవాదాయ, ధర్మాదాయ శాఖ గానీ, ప్రభుత్వం గానీ స్వాధీనం చేసుకుని పరిరక్షణకు కృషి చేయాలని మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ అన్నారు. స్థానిక లక్ష్మీ నృసింహ వైశ్య సమాజ భవనంలో గురువారం జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా పేద మధ్య తరగతి ప్రజలు తమ్మన వారి సత్రాన్ని అపర కర్మల సత్రంగా వినియోగించుకుంటున్నారన్నారు. సమాజం కోశాధికారి జల్దు భాను ప్రకాష్ మాట్లాడుతూ కులాలకు అతీతంగా పేద, మధ్య తరగతి ప్రజలు అపర కర్మలు నిర్వహించుకోవడానికి వీలుగానున్న ఈ సత్రం కోట్లాది రూపాయల విలువ చేస్తుందన్నారు. స్వార్థ చింతనతో దీనిని దక్కించుకోవడానికి కొందరు కృషి చేస్తున్నారన్నారు. 40 యేళ్లకు ముందే దేవాదాయ, ధర్మాదాయ శాఖ రిజిస్టర్‌లో నమోదు చేయబడిన ఈ సత్రాన్ని లక్ష్మీ నృసింహ వైశ్య సమాజం లాభాపేక్ష లేకుండా అపర కర్మల సత్రముగా నిర్వహిస్తున్నదన్నారు. కొందరు తమ స్వార్థం కోసం దీనిని దక్కించుకోవడానికి చేసిన ప్రయత్నం కారణంగా ప్రస్తుతం దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉందన్నారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉన్న సత్రం భవనాన్ని రాత్రికి రాత్రి పడగొట్టటం జరిగిందన్నారు. సమాజం అధ్యక్షుడు గుడివాడ వెంకట గున్నయ్యశెట్టి మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే ఈ సత్రాన్ని ఎండోమెంట్ బోర్డు, ప్రభుత్వం గానీ పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సమావేశంలో నిడమానూరు దుర్గా మల్లేశ్వరరావు, గుడివాడ మెహర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.