కృష్ణ

తీరం.. దాహం.. దాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: సముద్ర తీర గ్రామాల్లో దాహం కేకలు రోజు రోజుకీ మిన్నంటుతున్నాయి. తీరం డెల్టా శివారు ప్రాంతం కావటంతో సహజంగానే మంచినీటి ఎద్దడి ఎదురవుతుంది. ప్రస్తుత వేసవిలో ఆ సమస్య మరింత తీవ్రరూపం దాల్చింది. తీరంలో ఎక్కడ బోరు వేసి మంచినీటి ఎద్దడిని నివారిద్దామన్నా మంచినీరు పడే పరిస్థితి లేదు. దీంతో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే నీరే దిక్కు. మంచినీటి అవసరాలకు కాలువలకు నీరు వదిలినా శివారు ప్రాంతాలు కావటంతో తీర ప్రాంత గ్రామాలకు ఆ నీరు అందని పరిస్థితి నెలకొంటుంది. ఫలితంగా ఆయా గ్రామాల్లో మంచినీటి చెరువులు ఎండిపోవడం మినహా మంచినీటితో నిండిన రోజులు చాలా అరుదుగా ఉంటాయి. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలైన కృత్తివెన్ను మొదలుకుని నాగాయలంక వరకు మంచినీటి సమస్య తిష్ట వేసి ఉంది. ఏ తీర గ్రామం చూసినా మంచినీటి కోహం తహతహలాడుతున్నారు. కాలువల్లో నీరు పారక, వేసిన బోర్లలో మంచినీరు పడక ఈ ప్రాంత ప్రజలు గుక్కెడు నీటి కోసం పడరాని పాట్లు పడాల్సి వస్తోంది. సుదూర ప్రాంతాల నుండి మంచినీటిని కొనుగోలు చేసుకోవల్సిన దుస్థితి నెలకొందంటే అతిశయోక్తి కాదు. ప్రతి వేసవిలోనూ మంచినీటి సమస్య యధాతథంగానే ఉత్పన్నమవుతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో ప్రభుత్వాలు విపలమవుతూనే ఉన్నాయి. కృత్తివెన్ను, బంటుమిల్లి, మచిలీపట్నం, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక తీరం వెంబడి వందలాది గ్రామాల ప్రజలు గుక్కెడు నీటి కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ ప్రాంతాల్లో నెలకొన్న మంచినీటిని సమస్యను కొంతలో కొంత మేర పరిష్కరించేందుకు స్వచ్చంద సంస్థల ప్రతినిధులు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నా పూర్తి స్థాయిలో మాత్రం సమస్యకు పరిష్కారం లభించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎండలు మండుతున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో ఎండలు మరింత ముదిరి పాకాన పడే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో తీర గ్రామాల్లో మంచినీటి సమస్యను పరిష్కరించకపోతే ఆ ప్రాంత వాసులు గిలగిలా కొట్టుకోక తప్పదు.